- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండె దడ స్టార్టయిందా.. హాలిడే హార్ట్ సిండ్రోమ్ కావచ్చు
దిశ, ఫీచర్స్: మీకు సడెన్‌గా గుండె దడ మొదలయిందా? అయితే అది గుండె నొప్పి అని భయపడకండి. హాలిడే హార్ట్ సిండ్రోమ్ కావచ్చు. ఇది గుండె పనితీరుకు సంబంధించిన ఒక మూమెంట్. కాగా గుండె కొట్టుకునే తీరులో మార్పు కనిపించడం, లయ తప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి గుండె జబ్బులు లేకపోయినా గుండె దడగా అనిపించడం, ఛాతీలో అసౌర్యకర్యంగా తోచడం వంటి పరిస్థితినే హాలిడే హార్ట్ సిండ్రోమ్ (Holiday Heart Syndrome) అంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం స్థాయికి మించి ఆల్కహాల్ సేవించడం. బాడీలో ఇథనాల్ అధికంగా చేరినపుడు తీవ్రమైన కార్డియాక్ రిథమ్ స్టార్టవుతుంది. రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే దీనిని ఆల్కహాల్ ప్రేరిత సమస్యగా పేర్కొంటారు.
ఆల్కహాల్, కెఫిన్
అధిక మొత్తంలో ఆల్కహాల్ లేదా కెఫిన్ వంటివి తీసుకోవడం సేవించడం, హై కొలెస్ర్టాల్ పదార్థాలను తినడం, ఒత్తిడి స్థాయి పెరగడం, డీ హైడ్రేషన్ వంటివి హాలిడే సిండ్రోమ్ డెవలప్మెంట్‌కు దారితీస్తాయి. సాధారణంగా ఆయా వ్యక్తులు హాలిడేస్, వీకెండ్స్, ఫెస్టివల్ సీజన్‌లో నిర్వహించే వివిధ పార్టీల్లో పాల్గొంటూ విపరీతంగా మద్యం సేవిస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు గుండె దడకు కారణం అవుతుంటాయి.
అందుకే దీనినే హాలిడే హార్ట్ సిండ్రోమ్‌గా నిపుణులు పేర్కొంటారు. ఈ సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. పెద్దగా ప్రమాదం కాదు కానీ, ఇది వరకే గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారికి మాత్రం రిస్క్ అంటున్నారు వైద్య నిపుణులు. నివారణ పద్ధతులు పాటించకపోవడం, గుండె జబ్బులు ఉన్నవారు చికిత్స చేయించుకోకపోవడం వంటి పరిస్థితి చివరికి హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది.
లక్షణాలు
* నీరసం, సాధారణంకంటే అధికంగా అలిసిపోవడం
* ఛాతీలో అసౌకర్యం, నొప్పి, ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపించడం
* శరీరం మత్తుగా అనిపించడం, తలతిరగడం
* పనిచేస్తున్నప్పుడు, విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ట్రీట్‌మెంట్
హాలిడే హార్ట్ సిండ్రోమ్‌కు ట్రీట్‌మెంట్ ఆ వ్యక్తిలో సింప్టమ్స్‌ను బట్టి చేస్తారు. తరచుగా అనారోగ్యాల బారిన పడే వ్యక్తులకైతే ‘కార్డియోవర్షన్’ను సూచించవచ్చు. దీనివల్ల గుండె దడ పరిస్థితి పోయి సాధారణ స్థితికి చేరుతారు. ఇది లైట్ షాక్ ట్రీట్మెంట్ అన్నమాట. ఈ ట్రీట్‌మెంట్ చేయడంతోపాటు మద్యపానానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సజెష్ చేస్తారు.
నివారణ మార్గాలు
* ఆహారం రుచిగా ఉందని సరిపోయినా సరే ఎక్కువ తింటుంటారు. ఇలా చేయడంవల్ల కూడా ఛాతిలో మంట, గుండె దడ రావచ్చు.
* హై కేలరీలు ఉండే ఆహారం తీసుకోవద్దు.
* తరచూ ఒత్తిడితో కూడిన జీవన శైలి మంచిది కాదు.
* రిలాక్స్ కలిగించే పనులు చేయడంవల్ల ఉపశమనం
* NSAID వంటి మందులకు దూరంగా ఉండండి.
Also Read..