వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి .. అమ్మవారిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీవే?

by Anjali |   ( Updated:2024-08-14 09:24:52.0  )
వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి .. అమ్మవారిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీవే?
X

దిశ, ఫీచర్స్: వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ అతి ముఖ్యమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందే శుక్రవారం నాడు వస్తుంది. స్త్రీలంతా ఎంతో నిష్ఠతో కొలిచే వరలక్ష్మి దేవత విష్ణు మూర్తి సతీమణి. ఈ అమ్మని అడగ్గానే వరాలు ఇచ్చే దేవతగా ఆరాధిస్తారు. చాలా మంది పెళ్లి కానీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం రోజున ఫాస్టింగ్ ఉంటారు. వివాహిత భార్యలు భర్తల మంచి కోసం ఉపవాసం పడుతారు. అయితే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం 16 వ తేదీన వస్తుంది. కాగా అమ్మవారికి ఏఏ పూజా సామాగ్రి అవసరం ఉంటుంది. ఏ విధంగా పూజ చేస్తే ఇంట్లో సిరిసంపదలు వెల్లువిరిస్తాయో జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి..

విడిపూలు, గంధం, కుంకుమ, పసుపు, తమలాపాకులు, కర్పూరం, పూల మాలలు, ముప్పై వక్కలు, అగరువత్తులు, ఖర్జూరాలు, చిల్లర పైసలు, బ్లౌజ్ పీసు, తెల్లని వస్త్రం, మామిడి ఆకులు, 5 రకాల ఫ్రూట్స్, తెల్ల దారం, అమ్మవారి ఫొటో, కొబ్బరి కాయలు, కలశం, పసుపు రాసిన కంకణం, ప్రసాదాలు, అక్షింతలు, దీపారాధన కోసం వత్తులు, పంచామృతాలు, నెయ్యి కావాలి.

వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలంతా తలస్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించాలి. అనంతరం అమ్మవారి సామాగ్రి అంతా దేవుడి గదికి తీసుకెళ్లి వరుసగా క్రమంలో పెట్టాలి. ఒక్కో సామాగ్రిని అమ్మవారికి సమర్పిస్తూ నిష్ఠతో పూజ చేయాలి. అమ్మవారి ఫొటోకు కుంకుమ, పసుపు పెట్టాలి. తోరణాలు రెడీ చేసుకున్నాకే ప్రారంభించాలి.పూజకు ముందు కచ్చితంగా వినాయకుడికి పూజ చేయాలి. తర్వాత తర్వాత వరలక్ష్మి వ్రతం కథను చదవుతూ వ్రతం స్టార్ట్ చేయాలి.

పూజ కంప్లీట్ అయ్యాక అక్షింతలను తలపై చల్లుకోవాలి. మత్తైదువలకు తాంబూలాలు ఇవ్వడం మర్చిపోకూడదు. అమ్మవారి కోసం తయారు చేసిన ప్రసాదాన్ని పూజ అనంతరం అక్కడున్న వారందరికీ పంచిపెట్టాలి. పూజలో కూర్చొన్నవారు కూడా ప్రసాదం తినవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Read More..

90 ఏళ్ల తర్వాత వస్తోన్న రాఖీ ప్రత్యేక విశిష్టత ఇదే.. చాలా అరుదైన శుభయోగాలతో సోదరసోదరిమణుల బంధం?

Advertisement

Next Story

Most Viewed