- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Calcium deficiency: గర్భిణుల్లో కాల్షియం లోపం.. పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే..
దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా ఉండటంలో వివిధ పోషకాలు, విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇక స్త్రీల విషయానికి వస్తే గర్భధారణ సమయంలో ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కాల్షియం లోపం ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. దానివల్ల అలసట, ఎములకల బలహీనత ఏర్పడతాయి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అలా జరగకూడదంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. అయితే కాల్షియం లోపంవల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం.
ఎముకలు, దంతాల అభివృద్ధికి..
వాస్తవానికి ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో కాల్షియం కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఎదుగుతున్న శిశువులో ఎముకలు, దంతాలు బలంగా మారడానికి, డెవలప్ కావడానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం ద్వారానే కడుపులో ఉన్న శిశువుకు కూడా కాల్షియం, ఇతర పోషకాలు లభిస్తాయి. అంటే తల్లి శరీరంలో కాల్షియం లోపిస్తే ఆ ప్రభావం పుట్టబోయే శిశువుపై కూడా పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అట్లనే సదరు లోపం ఉన్న గర్భిణిలోనూ ఎముకలు బలహీనంగా మారుతాయి. డెలివరీ తర్వాత బోలు ఎముకల వ్యాధికి గురయ్యే చాన్స్ ఉంటుంది. కాబట్టి కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం.
కండరాలపై ప్రభావం
ప్రెగ్నెన్సీ సమయంలో తగిన కాల్షియం శరీరంలో లేకపోతే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై, ముఖ్యంగా కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. శిశువు ఎముకలు, గుండె కండరాలు, నరాల అభివృద్ధి సరిగ్గా జరగకపోవచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో కాల్షియం తగినంతగా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
రోజుకు ఎంత అవసరం?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో సాధారణంగా రోజుకు 1000 నుంచి 1200 మి. గ్రా. కాల్షియం అవసరం అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కాబట్టి అందుకు తగిన ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నువ్వులు, బాదం, పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు వంటివి తరచుగా తీసుకోవడంవల్ల కాల్షియం లభిస్తుంది. అలాగే డాక్టర్ల సలహా మేరకు అవసరమైన ఆహారాలు, మెడిసిన్ వాడాలి. అవసరం అయితే కాల్షియం టాబ్లెట్స్ కూడా వాడాల్సి రావచ్చు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునేముందు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.