వడగాలులతో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం.. బయటకు వెళ్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

by Sujitha Rachapalli |
వడగాలులతో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం.. బయటకు వెళ్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
X

దిశ, ఫీచర్స్: ఏప్రిల్ మొదటి వారంలోనే టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిపోయింది. మే నెలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వేడి అలసట, డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అంతేకాదు ఈ మండుటెండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు, రక్త ప్రవాహం సరిగ్గా జరిపేందుకు గుండె మరింత కష్టపడాల్సి ఉంటుంది. దీనిపై అధిక ఒత్తిడి పడినప్పుడు కార్డియోవాస్క్యులార్ కేర్ సరిగ్గా లేకపోవడం హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. అయితే హీట్ వేవ్‌, హార్ట్ ఎటాక్ మధ్య సంబంధం ఏంటి? వేడి గాలులు ఇందుకు ఎలా కారణం అవుతున్నాయి?

స్పెసిఫిక్ టెంపరేచర్స్‌లో హ్యూమన్ బాడీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే జీవక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి. అవయవాల పనితీరులో లోపాలు తలెత్తుతాయి. చెమట పెరుగుతుంది. శరీరం నుంచి నీరు ఎక్కువగా కోల్పోయి డీహైడ్రేషన్ అయిపోతుంది. ఈ సమయంలో చర్మానికి రక్తప్రవాహాన్ని పెంచేందుకు హార్ట్ వేగంగా పంప్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థలు ఉన్న వ్యక్తులు ఈ ఒత్తిడిని తట్టుకోగలరు కానీ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ లాంటి గుండె సంబంధిత అనారోగ్యం కలిగిన వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అధిక చెమట, బలహీనత, చర్మం చల్లబడిపోవడం, మూర్ఛ, వాంతులు హీట్ స్ట్రోక్ లక్షణాలు.కాగా తక్షణ వైద్య సహాయం అవసరం. లేదంటే గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1. వేసవిలో గుండె సంరక్షణ కోసం హైడ్రేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ, వేడి వాతావరణంలో అధిక శ్రమను నివారించండి. హార్ట్ పేషెంట్స్ డాక్టర్లు సూచించిన మందులు రెగ్యులర్‌గా తీసుకోవాలి.

2. సమ్మర్‌లో డైయురెటిక్స్ వంటి మందులు తీసుకునే రోగులలో అలసట, డీహైడ్రేషన్ ఫీలింగ్ అధికంగా ఉంటుంది. స్వెటింగ్ అధికంగా ఉంటుండటంతో మెడిసన్ డోస్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

3. అధిక ఉష్ణోగ్రతల సమయంలో హెవీ వర్కవుట్ లేదా ఫిజికల్ యాక్టివిటీ హార్ట్ స్ట్రోక్‌ అవకాశాలను పెంచుతుంది.

4. విపరీతమైన వేడికి గురికావడం మైకం, మూర్ఛకు దారి తీస్తుంది. అందుకే గుండె సమస్యతో బాధపడుతున్న రోగులు వేడి సమయంలో ఎక్కువగా శ్రమించకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఇంటి లోపలే ఉండాలి.

Advertisement

Next Story

Most Viewed