మీరు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా వెంటనే తెలుసుకోవచ్చు..

by Vinod kumar |   ( Updated:2023-03-31 08:38:25.0  )
మీరు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా వెంటనే తెలుసుకోవచ్చు..
X

దిశ, ఫీచర్స్: మీరు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా వెంటనే తెలుసుకోవచ్చు..హస్యమే. అయితే వర్చువల్ రియాలిటీ మరణానంతర జీవితం గురించి ప్రజల భయాలకు బ్రేక్ ఇచ్చేందుకు సహాయపడుతుంది. ఆర్టిస్ట్ షాన్ గ్లాడ్‌వెల్ మరణానికి సమీపంలో ఉన్న అనుభవాన్ని డెవలప్ చేశాడు. ఇందులో పాల్గొనేవారికి గుండె ఆగిపోవడం నుంచి బ్రెయిన్ డెత్ వరకు.. వారి ఆఖరి క్షణాల్లో ఏం జరుగుతుందనే విషయంపై ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. మృతదేహాలు పైన తేలుతున్నప్పుడు వాటిని చూసేందుకు వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.

ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న టిక్‌టాకర్ క్రూమ్ 12.. కంపించే మంచం మీద పడుకున్నాడని, అతనిని పునరుద్ధరించడంలో వైద్యులు విఫలమవడం చూశానని వివరించాడు. ఈ అనుభవం ప్రజలకు ఆందోళన కలిగిస్తుందని, ఎప్పుడైనా నిష్క్రమించవచ్చని చెప్పాడు. ఈ ప్రక్రియలో మరణ అనుభవాన్ని ఎదుర్కొన్న చాలా మంది.. చివరికి చీకటి సొరంగంలో కాంతిని చూడటం, ప్రియమైనవారి గొంతులను వినడం, హేయమైన వారి అరుపులు ఉంటాయని తెలిపారు. ఏదేమైనా ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత మన గురించి ఏం వెయిట్ చేస్తుందో చెప్పలేమన్నారు. మొత్తానికి గ్లాడ్‌వెల్ అనివార్యమైన ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు, మరణం అనే ఫీలింగ్‌ను స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడుతున్నాడు.

కాగా అతని ‘పాసింగ్ ఎలక్ట్రికల్ స్టార్మ్స్’ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నౌ ఈవెంట్‌లో ప్రదర్శించబడింది. ‘అవుట్-ఆఫ్-బాడీ’ స్వభావంతో కూడిన పార్టిసిపేటరీ XR ఎక్స్‌పీరియన్స్‌గా వర్ణించబడింది. ఇందులో పాల్గొనే వారు బెడ్‌పై పడుకుని, XR హెడ్‌సెట్‌ను ధరించి, గుండె ఆగిపోవడం, వారిని పునరుత్థానం చేసే ప్రయత్నం, శరీరానికి వెలుపల మరణం, భూమిని అధిగమించే అనుభవాన్ని పొందుతారు. దీన్ని ‘ధ్యానం, అశాంతి’గా చెప్తుంటారు.

ఇవి కూడా చదవండి: శ్రీరామనవమి విశిష్టత.. ఈరోజే సీతారాముల కళ్యాణం ఎందుకు జరుపుతారంటే?

Advertisement

Next Story

Most Viewed