- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డయాబెటిస్ ఉన్నవారు ఐస్ క్రీమ్ తింటే ఏం జరుగుతుందంటే?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎండ తీవ్రత ఎలా అధిక స్థాయిలో ఉంటుంది దీని వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. ఈ సమయంలో, చల్లని ఆహారాలు తీసుకుంటే మంచిదని భావిస్తారు. వాటిలో ఐస్ క్రీం తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు ఐస్ క్రీం తినవచ్చా? తింటే ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఐస్ క్రీం తినేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.ఎందుకంటే, ఐస్‌క్రీమ్‌లో చక్కెర , కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి కలిగే నష్టాలు గురించి ఇక్కడ చూద్దాం..
గుండె జబ్బులు
మధుమేహం ఉన్నవారు ఐస్ క్రీమ్ తింటే గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐస్ క్రీం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బరువు పెరగడం
ఐస్ క్రీమ్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ఎక్కువగా తింటే బరువు సులభంగా పెరుగుతారు. కాబట్టి ఐస్ క్రీమ్ ని తీసుకోకపోవడమే మంచిది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం
దీనిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.