బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

by sudharani |   ( Updated:2023-09-19 14:53:05.0  )
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి శరీరంలో కిడ్నీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే.. చాలా మందికి వివిధ కారణాలతో కిడ్నీలో ఈజీగా రాళ్లు చేరతాయి. వాటితో చాలా ఇబ్బంది పడతారు. ఎక్కువ సేపు నడవలేరు. కూర్చోలేరు. పనులు చేసుకోలేరు. కిడ్నీలో రాళ్లు చేయడం వల్ల తీవ్రమైన నడుం నొప్పి వాళ్లను వేధిస్తుంటుంది. అయితే.. కిడ్నీలో రాళ్లు కరిగించేందుకు ఆపరేషన్లు, ఔషధాలు ఎన్నో ఉన్నాయి. కానీ, బీరు తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల సమస్య తీరుతుందని చాలా మంది అంటుంటారు. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉంది..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

బీర్ ఒక ఆల్కాహాలిక్ డ్రింక్. ఇది తాగడం వల్ల సాధారణం కంటే ఎక్కువ మూత్ర విసర్జన అవుతోంది. దీంతో బీరు చిన్న రాళ్లను బయటకు తీయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఎక్కడా ధ్రువీకరించలేదు. ఇది కేవలం అపోహా మాత్రమేనని నిపుణులు తెలుపుతున్నారు. అంతే కాకుండా.. రాళ్లు కరిగిస్తుంది కదా అని అదే పనిగా బీరు తాగితే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందని, మద్యం ఏ సందర్భంలోనైనా హానికరమని చెబుతున్నారు నిపుణులు.

Advertisement

Next Story