Walking Tips : ఆ సమయంలో వాకింగ్ చేస్తే కీళ్లు అరిగిపోతాయా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-17 07:41:48.0  )
Walking Tips : ఆ సమయంలో వాకింగ్ చేస్తే కీళ్లు అరిగిపోతాయా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : హెల్తీగా ఉండాలంటే డైలీ మార్నింగ్ వాక్ చేస్తే మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా నిపుణులు చెప్తుంటారు. గుండె ఆరోగ్యానికి వ్యాయామాలు లేదా కనీసం రోజువారీ నడక చాలా మంచిది. అయితే రోజూ ఇలా చేయడంవల్ల కీళ్లు అరిగిపోతాయని, బలహీనంగా మారుతాయనే అపోహలు, అనుమానాలు కూడా కొందరిలో వ్యక్తం అవుతూ ఉంటాయి. నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

* వాకింగ్ చేయడంవల్ల కీళ్లు అరిగిపోయే అవకాశం ఉందనేది కేవలం అపోహ మాత్రమే. దీనివల్ల కీళ్లు, మోకాళ్లకు ఎటువంటి హాని జరగదని ఆర్థోపెడిక్ నిపుణులు అంటున్నారు. అయితే వయస్సు పైబడిన వారు వాకింగ్ ప్రారంభిస్తూనే ఒక్కసారిగా వేగం పెంచ కూడదు. దీనివల్ల కొన్నిసార్లు కాళ్లు, కీళ్లు బెణకడమో, పట్టడమో జరుగుతాయి. ఫలితంగా నొప్పి ఏర్పడవచ్చు తప్ప నిజానికి వాకింగ్ వల్ల ఎటువంటి సమస్య ఉండదు.

* నడకను ప్రారంభించే ముందు 45 ఏండ్ల దాటిన వ్యక్తులైతే స్లోగా స్టార్ట్ చేయాలి. క్రమంగా శక్తి మేరకు వేగాన్ని పెంచాలి. అంతే తప్ప ఒకేసారి స్పీడ్‌గా నడవడం అంతమంచిది కాదు. అలాగే మోకాళ్లలో వాకింగ్ సందర్భంగా సమస్యలు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి బాడీ మూవ్ మెంట్స్‌ను సర్దుబాటు చేస్తాయి.

* ఎక్కువసేపు వాకింగ్ చేయాల్సిన వాళ్లు రోడ్లపై, గ్రౌండ్‌లలో నడుస్తున్నప్పుడు రాళ్లు గుచ్చుకోవడం, లేకపోతే కలుషితాలవల్ల బ్యాక్టీరియాలు, వైరస్‌లు వంటివి పాదాలకు అంటుకోవడం జరిగే అవకాశం లేకపోలేదు. ఎంతకైనా మంచిది సేఫ్టీ కోసం వాకింగ్ చేసేవారు షూస్ వాడాలంటున్నారు నిపుణులు.

* కొందరికి సాధారణంగానే అప్పుడప్పుడు లేదా సీజనల్ ప్రభావాల కారణంగా కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఒకటి రెండు రోజులు వాకింగ్ తగ్గించడం బెటర్. అట్లనే మోకాళ్లకు, కీళ్లకు గాయాలైనప్పుడు నడవగలిగే శక్తి ఉన్నా 10 మీటర్ల కంటే ఎక్కువ నడవడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మోకాళ్ల నొప్పులు నార్మల్‌గా ఉంటే మెట్లు ఎక్కడం, దిగడం వంటివి కొనసాగించినా మేలు జరుగుతుంది. మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలు బలపడటానికి ఇది దోహదపడుతుంది.

* ఆహారాల విషయానికి వస్తే కీళ్లు, మోకాళ్ల బలానికి బాదం పప్పులు, ఖర్జూర, అంజీర్, చికెన్ బోన్ సూప్, మటన్ బోన్ సూప్, బ్రోకలి, క్యాబేజీ వంటి కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అలాగే సరైన బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు ఉన్నవారిలో మోకాళ్ల నొప్పులు సంభవించడం మిగతావారితో పోల్చితే వీరిలో నొప్పి, అసౌకర్యం అధికంగా ఉంటాయి. కాబట్టి ఓవర్ వెయిట్ పెరగకుండా చూసుకోవడం బెటర్.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed