- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fitness: మీరు బాడీ ఫిట్‌నెస్ కోరుకుంటున్నారా?.. అయితే డైలీ 2 మినిట్స్ వెనుకకు నడవండి!
దిశ, ఫీచర్స్: మీరు బాడీ ఫిట్‌నెస్ కోసం డైలీ ఎక్సర్ సైజ్ చేస్తున్నారా? అయితే డైలీ రెండు నిమిషాలు వెనుకకు నడవడం కూడా చేయండి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఫిట్‌నెస్ సైన్స్ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న క్రమంలో దీనిని దిన చర్యగా కలిగి ఉండటం ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నారు. అయితే మనిషి శరీరం ముందుకు నడిచే కదలికల నిర్మాణాన్ని కలిగి ఉన్నందున, వెనుకకు నడవడం అనే విషయాన్ని మనస్సు వెంటనే అంగీకరించదు. అందుకే ఎవరినైనా 5 నిమిషాలు వెనుకకు నడవండి అనగానే ఎందుకు అని వెంటనే ప్రశ్నిస్తారు. సమాధానం ఏంటంటే.. ట్రైనింగ్స్ అన్నీ సురక్షితంగా లేవడం లేదా కూర్చోవడం వంటి ప్రాథమిక అంశాలకే పరిమితం కావు. కొన్ని ఎక్సర్ సైజులు, కండరాలపై భారాన్ని విభజించే శరీర సామర్థ్యాన్ని నిర్వహించడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి బాడీకి కొత్త కదలికలను నేర్పించగలగాలి.
“క్వాడ్రిస్ప్స్ పనితీరు, అలాగే హామ్ స్ట్రింగ్స్ ఎలా పనిచేస్తాయో పరిశీలించండి. ప్రతీ కదలికతో ఒక వ్యతిరేక కండరం పని చేస్తుంది. కొంతకాలం పాటు మీరు ముందుకు సాగుతూనే ఉంటే.. శరీరం దాని సాధారణ కదలికలో లేనప్పుడు (ఇది ముందుకు) కొన్ని లోడ్‌లను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి" అని గోవాలోని డెంపో స్పోర్టింగ్ క్లబ్‌లో ఫిజియోథెరపిస్ట్ అయిన ఆరోన్ రోడ్రిగ్స్ చెప్తున్నారు. అతను దీని కోసం ‘ప్రోప్రియోసెప్షన్’ అనే సైంటిఫిక్ వర్డ్‌ను యూజ్ చేశాడు. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ న్యూరోసైన్స్ (2009)లో “ప్రోప్రియోసెప్షన్’ అంటే.. శరీర భాగాల స్థానంలో కదలికలను మనం గ్రహించేలా చేస్తుందని నిర్వచించబడింది. ఈ కదలికలు, కండరాల బలానికి దోహదం చేస్తాయి. అవయవాల కదలికలు, స్థానాలు, శక్తి, భారం, దృఢత్వం వంటి అంశాలను అంచనా వేయడానికి ఇది వీలు కల్పిస్తుంది’’ అని ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు.
మీరు క్రీడల సందర్భంగా మ్యాచ్‌లకు ముందు వార్మప్ షాట్‌లను గమనించినట్లయితే, వెనుకకు, పక్కకు పరుగెత్తడం చేయడం గమనించే ఉంటారు. ఇది కసరత్తులలో భాగం అన్నమాట. స్ప్రింటర్లు కూడా తమ ట్రైనింగ్ సమయంలో వెనుకకు పరుగెత్తుతారు. ఎందుకంటే వివిధ కదలికలకు అనుగుణంగా మూవ్ అవడం అథ్లెట్ స్కిల్స్‌లో భాగం. 2 నుంచి 5 నిమిషాలు వెనుకకు నడవడం(backwards) చాలా మేలు చేస్తుంది. “మీరు ట్రెడ్‌మిల్‌కి వెళ్లేవారైతే అంతకుముందు రోడ్డుపై లేదా ఇంట్లో 100 నుంచి 200 మీటర్ల వెనుకకు నడవడం చేయండి. దీనివల్ల బాడీ ఇన్ బ్యాలెన్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది’’అని స్పోర్ట్స్ నిపుణులు చెప్తున్నారు. మనం మోకాలిలోని క్రూసియేట్ లిగమెంట్‌లు, మధ్యస్థ స్నాయువులపై ఆధారపడి పనిచేస్తాం. అయితే వెనుక క్రూసియేట్ లిగమెంట్ (PCL) కోసం ఎటువంటి పనీ చేయం. బ్యాక్ వర్డ్ వ్యాయామం దీనికి మేలు చేస్తుంది. చీలమండ స్నాయువులకు కూడా పని చేస్తుంది" అని రోడ్రిగ్స్ వెల్లడించాడు.
బ్యాక్‌వర్డ్ ప్రయోజనాలు
బ్యాక్‌వర్డ్ రన్నింగ్ లేదా వాకింగ్ కలయిక కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. బాడీ షేప్‌లో మంచి మార్పు వస్తుంది. సరరైన ఫిట్ నెస్‌తో మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అవయవాల పనితీరు మెరుగు పడుతుంది. వెనుకకు నడవడంవల్ల శరీరం పడిపోకుండా, బేసిగ్గా అనిపించకుండా బ్యాలెన్స్‌డ్డ్‌గా ఉంటుంది. పైగా ముందుకు నడవడం కంటే వెనుకకు నడవడంవల్ల అసాధారణంగా 40 శాతం ఎక్కువ శక్తిని ఖర్చవుతుంది. కాబట్టి ఇది గొప్ప ఎక్సర్ సైజ్. ఫిట్‌నెస్, హెల్తీలైఫ్ కోరుకునేవారు డైలీ వర్కవుట్‌లో రెండు నిమిషాలు వెనుకకు నడవడం ప్రారంభించాలని, క్రమంగా వ్యవధి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read..