Vitamin B12 Deficiency : ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీలో ఆ లోపం ఉండవచ్చు!

by Javid Pasha |   ( Updated:2024-11-21 14:10:37.0  )
Vitamin B12 Deficiency : ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీలో ఆ లోపం ఉండవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ఏ పనీ చేయకున్నా అలసటగా అనిపిస్తోందా? సమయానికి తింటున్నా శరీరం సత్తువ కోల్పోతోందా? ఎప్పుడంటే అప్పుడు తలనొప్పి లేదా మైకం వేధిస్తున్నాయా? అయితే అనుమానించాల్సిందే. ఎందుకంటే మీలో విటమిన్ బి12 లోపంవల్ల కూడా ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇంతకీ ఈ లోపం ఎందుకు ఏర్పడుతుంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎలా నివారించాలి? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు, వ్యాధులకు విటమిన్ బి 12 లోపం కూడా ఒక ప్రధాన కారణమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం మన దేశంలో 30 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నది. జంక్ ఫుడ్స్ అధికంగా తింటూ, ఆరోగ్య కరమైన ఆహారాలను విస్మరించడం, జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో ప్రతికూల మార్పులు వంటివి కూడా పరోక్షంగా ఇందుకు కారణం అవుతున్నాయి. దీంతో చాలా మంది వివిధ వ్యాధుల రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు.

ఏం జరుగుతుంది?

ఆరోగ్య నిపుణులు ప్రకారం విటమిన్ బి 12 లోపం శరీరంలోని ప్రతీ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది. పైగా ఇది వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎర్ర రక్తకణాల తగ్గుదలకు దారితీస్తుంది. కొందరిలో మెగాలో బ్లాస్టిక్ ఎనీమియా, రక్తహీనత వంటివి ఏర్పడేందుకు విటమిన్ బి12 లోపమే కారణం అంటున్నారు నిపుణులు.

ఈ రిస్క్ పెరుగుతుంది

విటమిన్ బి12 లోపంవల్ల మెదడు సంబంధిత వ్యాధుల రిస్క్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. డిమెన్షియా వచ్చి జ్ఞాపకశక్తి తగ్గవచ్చు. కొందరు పెరిఫెరల్ న్యూరోపతికి గురయ్యే చాన్స్ ఉంటుంది. 2021 నాటి ఒక అధ్యయనం ప్రకారం.. బి12 విటమిన్ లోపం వృద్ధాప్యంలో పార్కిన్సన్ వ్యాధికి దారితీస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి పెరుగుతాయి. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.

ఎందుకు లోపిస్తుంది?

శరీరంలో విటమిన్ బి 12 లోపం తలెత్తడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. ముఖ్యంగా రోజువారి ఆహారంలో పాలు, పెరుగు, వెన్న, ఆకు కూరలు, పండ్లు వంటివి లేకపోవడం ఈ సమస్యను పెంచుతుంది.

లక్షణాలు

ఏ వర్క్ చేయకున్నా అలసిపోవడం, శారీరక బలహీనత, తలనొప్పి, మైకం, స్కిన్ అలెర్జీలు, వ్యాధులు, బరువు తగ్గడం, తల వెంట్రుకలు చిట్లిపోవడం, జుట్టు రాలడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటివి విటమిన్ బి12 లోపంవల్ల కనిపించే లక్షణాల్లో ప్రధానమైనవి.

ఎలా భర్తీ చేయాలి?

సాధారణంగా తగిన పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా మీ డైట్‌లో పాలు, గుడ్లు, చేపలు, మాంసం, పెరుగు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, తాజా కూరగాయలు వంటివి తప్పక ఉండేలా చూసుకోవాలి. వీటిని తక్కువ తింటూ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. దీంతోపాటు డైలీ ఫిజికల్ యాక్టివిటీస్, సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ విటమిన్ బి12 లోపంతో ఏదైనా అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వైద్య నిపుణులను సంప్రదించాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story