Viral Video: ఓర్నీ తెలివి సల్లగుండా.. ఎలా వస్తాయ్ రా బాబు ఇలాంటి ఐడియాలు!

by Javid Pasha |
Viral Video: ఓర్నీ తెలివి సల్లగుండా.. ఎలా వస్తాయ్ రా బాబు ఇలాంటి ఐడియాలు!
X

దిశ, ఫీచర్స్: మన చుట్టూ సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడూ ఆశ్చర్య పరుస్తుంటాయి. కొన్ని విషయాలు వినడానికి వింతగా అనిపిస్తుంటాయి. అసలు ఎలా సాధ్యం? ఈ ఐడియాలు ఎలా వస్తాయి? అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తూ.. నవ్వులు పూయిస్తోంది. పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అది చూసిన నెటిజన్లు ఏం తెలివిరా బాబు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రైళ్లల్లో ప్రయాణించడమంటే దాదాపు అందరికీ ఇష్టమే. కాకపోతే కొన్నిసార్లు జర్నీ అంత ఈజీగా ఉండదు. జనరల్ భోగీల్లో అయితే అసలు సీట్లే దొరకవు. ఇరుకిరుకుగా నిలబడి ఎంతో కష్టంగా గమ్యం చేరాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను మనదేశంలో ప్రతిరోజూ ఎంతో మంది ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అదే కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యపర్చింది. రైల్లోని జనరల్ బోగీ ప్రయాణికులతో నిండుగా ఉంది. కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేదు. ఇంతలో ఓ వ్యక్తి పైన కనిపించే రెండు బెర్త్‌లకు మధ్య ఓ దుప్పటి కట్టి ఉయ్యాల మాదిరి ఏర్పాటు చేసుకొని హాయిగా అందులో పడుకున్నాడు. అంతసేపు ఎవరికీ రాని ఐడియా సదరు యువకుడికి రావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. ఓర్నీ తెలివి సల్లగుండా.. ఎలా వస్తాయ్ రా బాబు ఇలాంటి ఐడియాలు అంటూ తెగమెచ్చుకుంటున్నారు. ఇండియాలో టాలెంట్‌కేమీ కొదువలేదని కొందరు కామెంట్ చేయగా.. చైనా, జపాన్ వాళ్లు ఏదేదో కనిపెడుతుంటే ఇండియాలో మాత్రం మనం ఇలాంటి కనిపెడుతుంటామని మరికొందరు స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed