viral: అది ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం.. స్పెషాలిటీ ఏంటంటే..

by Javid Pasha |
viral: అది ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం.. స్పెషాలిటీ ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్: ప్రపచంలోనే అత్యంత ధనిక దేశం ఏది?, అత్యధిక ఆదాయం కలిగిన ఫేమస్ నగరాలేవి?, వరల్డ్ రిచెస్ట్‌మన్ ఎవరు?.. ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరకడం చాలా ఈజీనే. కానీ వరల్డ్‌లోనే అత్యంత ధనిక గ్రామం కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? ప్రస్తుతం అలాంటి విలేజ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నారు పలువురు. ఇంతకీ ఆ ధనిక గ్రామం ఎక్కడుంది అనుకుంటున్నారా?, మన దేశంలోనే.. గుజరాత్ రాష్ట్రంలో గల కచ్ జిల్లాలో ఉంది. పేరు మాధాపర్.

వరల్డ్ రిచెస్ట్ విలేజ్‌గా పేర్కొంటున్న మాధాపర్‌లో 7600 ఇండ్లు, 17 బ్యాంకులు ఉన్నాయి. విశేషం ఏంటంటే.. కేవలం ఆ ఊరికి చెందిన ప్రజల డబ్బులే ఇక్కడి బ్యాంకుల్లో మొత్తం రూ. 5000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయట. దీనిని బట్టి అక్కడి ప్రజలు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పలువురు నిపుణులు. అయితే ఒక చిన్న గ్రామంలో అన్ని బ్యాంకులు, అన్ని కోట్ల డబ్బు సంపాదన ఎలా సాధ్యమైంది? అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానం ఏంటంటే.. ఈ గ్రామంలోని ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరిద్దరు లండన్, అమెరికా, కెనడా, ఆఫ్రికా, గల్ఫ్ వంటి దేశాల్లో సెటిల్ అయ్యారు. వారి సంపాదన కూడా పెద్ద మొత్తంలో ఉండటం, పైగా వారు తమ గ్రామంలోని కుటుంబ సభ్యులకు డబ్బులు పంపడం, ఇక్కడి బ్యాంకుల్లో జమ చేయడం వంటి కారణాలు ఆ గ్రామాన్ని ప్రపంచంలోనే రిచెస్ట్ విలేజ్‌గా నిలబెట్టాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed