Viral : ఫుడ్ డెలివరీలో ప్లాస్టిక్ కంటెయినర్లు వాడొద్దంటూ కస్టమర్ రిక్వెస్ట్.. జొమాటో సీఈఓ రియాక్షన్ ఇదే..

by Javid Pasha |   ( Updated:2024-06-22 06:11:08.0  )
Viral : ఫుడ్ డెలివరీలో ప్లాస్టిక్ కంటెయినర్లు వాడొద్దంటూ కస్టమర్ రిక్వెస్ట్.. జొమాటో సీఈఓ రియాక్షన్ ఇదే..
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కంటెయినర్లు, కెమికలైజ్డ్ ప్యాకేజ్డ్ సామగ్రి వాడకాన్ని తగ్గించాలంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా జొమాటో, స్విగ్గీ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేస్తూ పోస్టు పెట్టాడు. పర్యావరణ హిత ప్లాస్టిక్ యేతర కంటెయినర్లలో ఫుడ్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రజెంట్ ఇది నెట్టింట వైరల్‌ అవుతుండగా ఏకంగా జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ కూడా స్పందించారు.

‘‘ఈ సమస్యను ప్రస్తావించినందకు చాలా గర్వంగా ఉంది. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే పర్యావరణహిత కంటెయినర్లలో ఫుడ్ డెలివరీ చేసే రెస్టారెంట్లను కస్టమర్లు తమ యాప్‌లలో ఈజీగా గుర్తించేలా తగిన యాక్షన్ తీసుకుంటాం’’ అని రిప్లయ్ ఇచ్చారు. ఇక ఈ పోస్టు పెట్టిన వ్యక్తితోపాటు, దానిపై స్పందించిన జొమాటో సీఈఓకు నెటిజన్లు అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. ఫుడ్ డెలివరీలో హానికర ప్లాస్టిక్ వాడకపోవడంపై సానుకూలంగా స్పందించనందుకు థ్యాంక్స్ చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed