- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్వలింగ సంపర్కులదీ ప్రేమే...!! వారికీ వాలెంటైన్స్ డేలో చోటు కల్పిద్దాం!!
దిశ, ఫీచర్స్: తొలి చూపు.. తొలి స్పర్శ.. తొలి ప్రేమ.. ఒక అమ్మాయి-అబ్బాయి లవ్ ప్రపోజల్ సీన్స్‌లో తరచుగా కనిపించే పదాలు ఇవే. అలాగే గుండె లోతుల్లోని ప్రేమను కవితాక్షరాలుగా మలిచి లేఖ రాయడం ప్రేమికులకు అలవాటే. పూలతో కాదల్ కబురును చేరవేయడం.. యాక్సెప్ట్ చేస్తే వాలెంటైన్స్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం.. ఒకవేళ నో చెప్తే.. 'నీ కోసం జన్మజన్మలకు వెయిట్ చేస్తాను'అని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడమూ పరిపాటే.
కానీ 'ప్రేమికుల రోజు'న కేవలం స్త్రీ-పురుషుల నడుమ పుట్టే ప్రేమనే సెలబ్రేట్ చేసుకోవాలా? ప్యార్ అంటే అపోజిట్ జెండర్స్ మధ్యే పుట్టాలా? స్వలింగ సంపర్కుల్లోనూ 'ప్యూర్ లవ్' ఉన్నప్పుడు.. వాలెంటైన్స్ డేలో నాన్-బైనరీ లవ్ సెలబ్రేషన్స్ ఎందుకు ఉండకూడదు? సేమ్ జెండర్ ప్రేమను ఎందుకు సాధారణీకరించకూడదు?
వాలెంటైన్స్ డే అనేది ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజు. ఇది అమ్మాయి-అబ్బాయి మధ్య కలిగే ప్రేమకు మాత్రమే కాదు నాన్-బైనరీ లవ్‌కు కూడా అంకితం చేయబడాలి. తద్వారా వారి ప్రేమ, బంధం కూడా గుర్తింపు పొందుతుంది. సాధారణంగా అమ్మాయి-అమ్మాయి/అబ్బాయి-అబ్బాయి మధ్య బంధాన్ని యాక్సెప్ట్ చేసేందుకు సమాజం ముందుకు రాదు.
కానీ వారి భావాలకు ప్రాధాన్యతనివ్వడం సాటి మనుషులుగా మన బాధ్యత కాదంటారా? ఎర్ర గులాబీలు, ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు బెలూన్‌లతో కూడిన సెలబ్రేషన్స్ జరుపుకున్నంత మాత్రాన ప్రేమను జరుపుకున్నట్లు కాదు. స్వలింగ సంపర్కులను కూడా కలుపుకుపోతోనే నిజమైన 'ప్రేమికుల రోజు'. వారి ప్రేమను ఆమోదిస్తేనే 'పవిత్ర ప్రేమ' గెలిచిందని అర్థం.
సాధారణంగా చాలా మందికి నాన్-బైనరీ లవ్ అంటే ఒక రకమైన అసహ్యం ఉంటుంది. మనం పెరిగే విధానం ఇందుకు కారణం. రీల్ అండ్ రియల్ లైఫ్‌లో భిన్న లింగాల మధ్య శృంగారాన్ని చూస్తూ పెరిగాం. స్వలింగ సంపర్కం, అలైంగికత్వం లేదా ఇతర నాన్-బైనరీ సంబంధాల గురించి మన తల్లిదండ్రులు కూడా మనకు చెప్పి ఉండరు. ఎడ్యుకేషన్ లైఫ్‌లోనూ ఎక్కడా ప్రస్తావన రాదు. అందుకే ఇలాంటి సంబంధాలు లోపాలుగా, హాస్యపూరితమైన అంశాలుగా చిత్రీకరించడుతున్నాయి.
నాన్-బైనరీ లవ్ సెలబ్రేషన్‌గా కూడా స్వీకరిద్దాం!!
ఆర్టికల్ 377(sexual acts against the order of nature)ను కొట్టేసిన తర్వాత స్వలింగ సంపర్కుల విషయంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కానీ వారిని మరింత కలుపుకుపోయినప్పుడు.. 'స్వలింగ ప్రేమ' సాధారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ఇండియన్ సొసైటీలో నాన్-బైనరీ సంబంధాలు పాశ్చాత్య సంస్కృతిగా పరిగణించబడుతున్నాయే తప్ప వారి భావోద్వేగాలుగా చూసే వారు తక్కువ. ఇది దేశీయ సంస్కృతిని దిగజార్చడానికి ఉద్దేశించబడిందని, యువతను భ్రష్టు పట్టించే మురికిగా మారిందని తిరస్కరిస్తున్నారు. కానీ వారి ఫీలింగ్స్‌ను అర్థం చేసుకునేవారు, అక్కున చేర్చుకునేవారు తక్కువే.
అందుకే నేటికీ 'ప్రైడ్ మార్చ్'ను అడ్డుకుంటున్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతించట్లేదు. ఒకవేళ తమ పిల్లలు ఇలాంటి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తే ఇదేం పోయేకాలం అంటూ గదిలోనే బంధిస్తున్నారు. వైద్యుల చుట్టూ తిప్పుతున్నారు. బ్లాక్ మ్యాజిక్ జరిగిందంటూ మూఢనమ్మకాల్లోనే బతుకుతున్నారు తప్ప కడుపున పుట్టిన బిడ్డ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి మనస్తత్వాలు మారనంత వరకు ప్రేమికుల రోజున నాన్-బైనరీ లవ్‌కు.. సమాన గౌరవం, ఆమోదం లభించడం అసాధ్యమే. కాబట్టి ఇలాంటి తిరస్కరణపై చర్చలను ముందుకు తీసుకెళ్లడం పౌరులుగా మన బాధ్యత.
వాలెంటైన్స్ డే రోజున నాన్-బైనరీ లవ్‌ను సెలబ్రేట్ చేసుకోవడంలో సహాయపడటం మన రెస్పాన్సిబిలిటీ. ఈ మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. కుటుంబ సభ్యుల్లో అవగాహన కల్పించాలి. ప్రేమికుల రోజున 'రెడ్ రోజెస్' మాత్రమే కాదు స్వలింగ సంపర్కుల చిహ్నమైన 'ఇంధ్రదనుస్సు రంగులు' వెల్లివిరియాలి.
ఇవి కూడా చదవండి : ప్రేమ ఎంత మధురం?