Warning : మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా..? ఫస్ట్ పెర్ఫ్యూమ్ వాడటం మానేయండి.. ఎందుకంటే..

by Sujitha Rachapalli |
Warning : మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా..? ఫస్ట్ పెర్ఫ్యూమ్  వాడటం మానేయండి.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : పెర్ఫ్యూమ్ యూజ్ చేయడం మనకు మంచి అనుభూతి కలిగిస్తుంది. కానీ ఈ సువాసనలో దాగి ఉన్న పదార్థం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాటి లేబుల్‌పై యాడ్ చేయబడని థాలేట్స్ భారీ సమస్యలకు కారణమవుతాయని చెప్తున్నారు. థాలేట్ అనేది సౌందర్య సాధానాల్లో ఉపయోగించే పదార్థం కాగా పెర్ఫ్యూమ్‌లతో పాటు నెయిల్ పాలిష్, హెయిర్ స్ప్రే, షాంపూలు, బాడీ వాష్‌లు, డియోడరెంట్‌లు, హ్యాండ్ వాష్‌లో కూడా ఉంటున్నాయి. రెండు రకాల థాలేట్స్ ఉండగా.. డైబ్యూటిల్ థాలేట్ (DBP) ప్లాస్టిక్‌ను సరళంగా చేస్తుంది. పగుళ్లను ఆపడానికి నెయిల్ పాలిష్‌లలో ఉపయోగించబడింది. డైమిథైల్ థాలేట్ (DMP) ఫ్లెక్సిబిలిటీని యాడ్ చేస్తుంది. కొన్ని హెయిర్ స్ప్రేలలో వినియోగించబడుతుంది.

FDA ప్రకారం DBP, DMP రెండూ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. డైథైల్ థాలేట్ (DEP) మాత్రం పెర్ఫ్యూమ్‌లలో సువాసనలను కలపడానికి యూజ్ చేయబడుతుంది. ఈ పద్ధతి మన ఆరోగ్యాన్ని సమస్యల్లో నెట్టేస్తుంది. థాలేట్స్ గుండె జబ్బులు, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని పలు అధ్యయనాలు గుర్తించాయి. టీనేజ్‌లో ADHD సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అలెర్జీలు, ఆస్తమా కూడా రావచ్చు. అయితే ఇవి హార్మోన్ల అంతరాయాలను కూడా కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి థాలేట్స్. పునరుత్పత్తి అవయవాల అభివృద్ధిని దెబ్బతీస్తాయి. గర్భం, డెలివరీ, శిశువులో సమస్యలను కలిగిస్తాయి ఎండోక్రైన్ అంతరాయం కలిగిస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థలోని హార్మోన్ల, సెల్యులార్ పనితీరుకు ఆటంకం కలిగేలా చేస్తాయి. థాలేట్‌ల అధిక స్థాయిలు వంధ్యత్వానికి, స్పెర్మ్ కౌంట్ తగ్గుదల, అండాల నాణ్యత తగ్గడం, గర్భస్రావానికి దారితీస్తాయి. రుతుక్రమంలో అంతరాయం, అండోత్సర్గము పనిచేయకపోవడం, ఎండోమెట్రియోసిస్ ప్రమాదం పెరగడంతో కూడా ముడిపడి ఉన్నాయి. పెర్ఫ్యూమ్ ఎక్స్‌పోజర్ వల్ల బాలికలు చిన్న వయస్సులోనే యుక్తవయస్సులోకి వెళ్లవచ్చు అని అధ్యయనాలు రుజువు చేశాయి.

Next Story

Most Viewed