- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Health : ఈ సమస్యను నిర్లక్ష్యం చేన్నారా..? వెన్నెముక అరిగిపోవచ్చు!

దిశ, ఫీచర్స్ : మధుమేహం.. బాధితుల జీవితంలో ఆందోళన కరపరిస్థితులకు కారణం అవుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఆహార నియమాలు పాటించకపోయినా ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే దానిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి స్ట్రోక్, గుండె జబ్బులు వంటి వాటికి దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అయితే సాధారణ సమయాల్లో వెన్ను లేదా నడుము నొప్పికి కూడా ఇది కారణం అవుతుందని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది.
*మానవుల్లో టైప్ 2 డయాబెటిస్ డెవలప్ కావడానికి, నడుము నొప్పితో బాధపడటానికి మధ్య గల ఆశ్చర్యకరమైన సంబంధాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా - శాన్ డియాగోలకు చెందిన పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. వెన్నుపూసపై, ఇటర్వర్టెబ్రెరల్ (intervertebral) డిస్క్‌లపై టైప్ -2 డయాబెటిస్ ప్రభావాన్ని వారు పరిశీలించారు. కాగా ఈ పరిస్థితి వల్ల డిస్క్ డీజనరేటివ్ రిస్క్ పెరుగుతున్నట్లు, క్రమంగా వెన్నెముక క్షీణిస్తున్నట్లు కూడా గుర్తించారు. మధుమేహ బాధితుల్లో వెన్నెముక డిస్క్‌లలో బయోమెకానికల్ మార్పులపై తమ పరిశోధన పలు కొత్త విషయాలు తెలుసుకునేందుకు దోహదం చేశాయని, అదే సమయంలో మరిన్ని పరిశోధనలకు తగిన అవగాహన కల్పించాయని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.
*వాస్తవానికి ఇటర్వర్టెబ్రెరల్ (intervertebral) డిస్క్‌లు వెన్నెముక ఎముకల మధ్య కుషన్‌లుగా పనిచేస్తాయి. ఫ్లెక్సిబిలిటీని, షాక్‌లను నియంత్రిస్తుంటాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో ఇవి మరింత దృఢంగా మారుతాయి. కొన్నిసార్లు అకాల ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ క్రమంలో అవి ఒత్తిడిని సమర్థవంతంగా మేనేజ్ చేయగల వ్యక్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి నడుము నొప్పి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ఇది కూడా ఒక కారణం అవుతోందని నిపుణులు చెప్తున్నారు. డయాబెటిస్‌లో డిస్క్ క్షీణతను అర్థం చేసుకోవడం ద్వారా నివారణ చర్యలు, చికిత్సల అభివృద్ధిపై పరిశోధకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
*డయాబెటిస్ వల్ల ఇతర అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దానిని అదుపులో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అందుకోసం ఫైబర్‌తో కూడిన ఆహారాలు, స్టార్చ్ లేని కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ కోసం బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, బీన్స్, పండ్లు, పాలకూర, ఇతర ఆకు కూరలు, మిరియాలు, క్యారెట్లు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అట్లనే చక్కెర, వైట్ రైస్, బ్రెడ్ , స్వీట్స్, సోడాలు, జంక్ ఫుడ్స్ వంటివి తగ్గించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.