- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాదులో టేస్టీ హలీం దొరికే టాప్ 12 రెస్టారెంట్లు ఇవే..!!
దిశ, ఫీచర్స్: రంజాన్ మాసం సమీపిస్తుండటంతో హైదరాబాద్ లోని రెస్టారెంట్లు నోరూరించే హలీంను తయారు చేసి జనాలకు అందించేందుకు రెడీ అవుతున్నాయి. రంజాన్ మాసంలో హలీం సందడే ఎక్కువగా ఉంటుంది. ఈ వంటకం అంటే అందరికీ నోరూరుతుంది. ఇరాన్ లో పుట్టిన వంటకాన్ని తయారు చేయడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది.
పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ లో ఉన్న మదీనా హోటల్ యాజమాన్యం దీనిని మొదట నగరానికి పరిచయం చేశారు. క్రమంగా వివిధ రెస్టారెంట్లు రంజాన్ సందర్భంగా హలీం తయారు చేయడం ప్రారంభించాయి. చికెన్, మటన్ లేదా నెయ్యి, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇతర పదార్ధాలతో హలీమ్ తయారు చేస్తారు.
అయితే ఈ సంవత్సరం హలీం రేటు ఎక్కువగానే ఉంది. పెరిగిన నిత్యావసరాలు, మాంసం రేట్ల ప్రభావం హలీంపై పడిందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా హలీం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. హలీం ను కేవలం ముస్లిం లే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హలీం బట్టీలు కనిపిస్తున్నాయి. ఒక్క పాతబస్తీలోనే వందల కొద్ది హలీం షాపులు ఏర్పాటు చేశారు.
అటు రంజాన్ మాసపు శోభ.. ఇటు హలీం బట్టీల సందడితో హైదరాబాదు నగరంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే హైదరాబాదులోనే ఎంతో అద్భుతమైన రుచిని అందించే 12 హలీం రెస్టారెంట్స్ ఇవేనంటూ పలువురు జనాలు సోషల్ మీడియా వేదికన తెలియజేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
*12 బెస్ట్ హలీం రెస్టారెంట్లు*
1. పిస్తా హౌస్
2. హోటల్ షాదాబ్
3. సుభాన్ బేకరీ
4. ప్యారడైస్
5. షా ఘౌస్
6. గ్రాండ్ హోటల్, అబిడ్స్
7. పెషావర్
8. కేఫ్ 555
9. సర్వి
10. కేఫ్ బహార్
11. నయాబ్ హోటల్
12. మందార్