ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు

by Prasanna |   ( Updated:2023-03-21 09:10:01.0  )
ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు
X

దిశ, ఫీచర్స్: ఎక్కువ సమయం స్క్రీన్‌లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతీ ఎక్స్‌ట్రా వన్ హవర్ స్క్రీన్ టైమ్ తొమ్మిది శాతం అధిక ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. ప్రత్యేకించి వీడియోలు చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం, మెసేజ్‌లు సెండ్ చేయడం, వీడియో చాటింగ్ ప్రభావం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. నేషన్‌వైడ్ అడోల్సెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ స్టడీ నుంచి డేటాను విశ్లేషించిన పరిశోధకులు.. . తొమ్మిది నుంచి 11 సంవత్సరాల మధ్య గల 12వేల మంది చిన్నారులపై రెండేళ్లుగా చేపట్టిన స్టడీలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

మొబైల్, టీవీ, పీసీ, ల్యాట్ టాప్‌లోనే గడపడం.. సామాజిక ఒంటరితనం, సైబర్ బెదిరింపు, నిద్ర భంగం లాంటి పరిస్థితులను కలిగించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. స్క్రీన్‌కు ఎక్కువ సమయం కేటాయించడం మూలంగా సదరు వ్యక్తి సమాజంలో ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్ర కోసం సమయాన్ని కేటాయించకపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. ‘ఇంగ్లండ్‌లో ఆరు నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో.. ఆరుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య పరిస్థితిని కలిగి ఉన్నారు’ అని ది హెల్త్ ఫౌండేషన్ తెలిపింది.

Read more:

మహిళలు నగ్నంగా పబ్లిక్‌గా ఈతకొట్టొచ్చు.. ప్రభుత్వ కీలక ఆదేశం

Advertisement

Next Story

Most Viewed