లివర్‌ను కాపాడుకోవాలంటే ఈ జ్యూస్ తప్పకుండా తాగాల్సిందే!

by Anjali |   ( Updated:2023-05-14 09:31:45.0  )
లివర్‌ను కాపాడుకోవాలంటే ఈ జ్యూస్ తప్పకుండా తాగాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా, డాక్టర్ సలహా లేకుండా టాబ్లెట్స్ వాడడం, మద్యపానం లాంటి అనేక కారణాల వల్ల కాలేయ ఆరోగ్యంపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపెడుతుంది. కాలేయాన్ని హెల్తీగా, పరిశుభ్రంగా, మలినాలు, విష పదార్థాలు పేరుకుపోకుండా ఉంచుకోవాలంటే కొన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన జ్యూస్ తాగండి. అవేంటో తెలుసుకుందామా..

* ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవడానికి ముందు సొరకాయ, కొత్తిమీర, పసుపు, నిమ్మరసం తీసుకోవాలి.

ఉపయోగాలు..

* సొరకాయతో కాలేయం శుభ్రపడడంతో పాటు ఎన్నో కాలేయ సమస్యలు కూడా తొలగిపోతాయి.

* కాలేయాన్ని మెరుగుపరచడంలో కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది.

* పసుపు ఉపయోగించడం వల్ల లివర్‌లో ఉండే విష పదార్థాలు సులభంగా తొలగిపోవడంతో పాటు కాలేయాన్ని శుభ్రపరచడంలో బాగా ప్రోత్సహిస్తాయి.

తయారీ విధానం..

* ముందుగా ఒక జార్‌లో ఒక కప్పు సొరకాయ ముక్కలను తీసుకుని అందులో గుప్పెడు కొత్తిమీర, కొంచెం వాటర్ పోసి.. జ్యూస్‌లా మిక్సీ పట్టుకోవాలి.

* తర్వాత ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్‌లోకి తీసుకుని అందులో అర చెక్క నిమ్మరసం, తగినంత నల్ల ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి కలపాలి.

* ఇక లివర్ డిటాక్స్ డ్రింక్ తయారయినట్లే. ఈ జ్యూస్‌ను ఉదయం పరగడుపున తాగాలి.

* దీనిని తాగిన 30 నిమిషాల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.

* ఈ విధంగా జ్యూస్‌ను తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి.

* కాలేయం పనితీరు కూడా బాగా మెరుగుపడుతుందని కాలేయ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read..

ఇతర గ్రహాలపై శబ్దాలు వినేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్..

బ్రెజిల్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు? Health Benefits of Eating Brazil Nuts?

Advertisement

Next Story