- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తీసుకుంటే చాలు!
దిశ, ఫీచర్స్: అంజీర్ పండ్లు తినడం వల్ల మన శరీరానికి గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి, ఉదయాన్నే తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రోజూ ఒకటి లేదా రెండు అంజీర పండ్లను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం..
ఫైబర్
అంజీర్ పండ్లలో ఫైబర్ ఉంటుంది. దీనిలో కరిగే, కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటుంది. అంజీర్ పండ్లను జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడంతోపాటు వీటిని మనం ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా, ఇది ఆరోగ్యకరమైన ప్రేగు పనితీరుకు కూడా సహాయపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు
అంజీర్ పండ్లలో అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ K, A, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మన శరీరం యొక్క పనితీరుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం
అంజీర్ పండ్లలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే ఖనిజాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంజీర్ పండ్లలో ముఖ్యంగా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
బరువు
అంజీర్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోజూ తీసుకుంటే.. మన పొట్ట ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది. క్రమంగా కేలరీలు తగ్గుతూ ఉంటాయి.