అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఇదేనట..!

by Kalyani |   ( Updated:2023-11-02 07:43:00.0  )
అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఇదేనట..!
X

దిశ, వెబ్‌డెస్క్ : అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఏంటని సాధారణంగా ఎవరిని అగిడిన ప్రేమ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా మీరు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రేమ కంటే ఎక్కువగా ఆక్సెప్టెన్సీ అంటే తనను తానుగా అంగీకరించడం. ఈ అమ్మాయిలా ఉంటే బాగుండు.. ఆమెలా ఉంటే ఇంకా బాగుండు అనే ఆలోచన లేకుండా తను మాత్రమే నాకు చాలు అనుకుంటే ఆ బంధం బలపడుతుంది. అలా అనుకున్నప్పుడే ఆ అబ్బాయి గాఢంగా ప్రేమిస్తాడు, కేర్‌గా చూసుకుంటాడు, అమ్మాయిలకు ఎప్పుడు తోడుంటాడని ఎక్కువ మంది అమ్మాయిలు చెప్పిన సమాధానాలు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం..!

సాధారణ గృహిణి మాట్లాడుతూ... నేను ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు పని చేస్తూనే ఉంటా. ఇంట్లో అందరికీ అన్ని రకాల సేవలు చేస్తా. కానీ నాకు ప్రాబ్లం వస్తే ఎవరు కేర్ తీసుకోకపోయినా మా ఆయన కేర్ తీసుకోవాలని బలంగా కోరుకుంటా. ప్రేమగా మాట్లాడకపోయిన పర్వాలేదు. సమస్య వస్తే ఆయన నా పక్కన ఉంటే నాకు కొండంత బలం అని చెప్పారు.

యువతి మాట్లాడుతూ.. నన్ను నన్నుగా అర్థం చేసుకునే అబ్బాయి కావాలి. ప్రేమిస్తున్నా అని చెప్పి, ఏవైన తనలో నచ్చని అంశాలు ఉంటే అవి వేరే వాళ్ళతో షేర్​ చేస్తున్నారు. ఇలా నా ఫ్రెండ్స్‌లో చాలా మందిని చూశా. అది నిజమేన ప్రేమ అనిపించుకోదు. ఫస్ట్ ​ఆ అమ్మాయిని తన సొంతమని ఫీల్ అవ్వాలి. అమ్మ మన సొంతం అనుకుంటాం. కాబట్టి ఎవరు తన గురించి తప్పుగా మాట్లాడినా మనం ఊరుకోం. అదే విధంగా అమ్మాయిల విషయంలో అబ్బాయిలు అలానే ఉండాలని కోరుకుంటా.

నిజమైన ప్రేమికుడు ఇలాగే ఉండాలని అభిప్రాయపడుతున్నారు అమ్మాయిలు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని ఏ అబ్బాయి ప్రపోజ్ చేసినా ముందు ఆ అమ్మాయి ఈ విషయాలనే గమనిస్తుందట. అందుకే అమ్మాయిలు వెంటనే ‘ఐ లవ్ యూ టు’ అని చెప్పరట. అతడిని నెలలు.. సంవత్సరాలపాటు తిప్పించుకుని ఆ సమయంలో అతడి బిహేవిర్, తన పట్ల అతడు తీసుకుంటున్న శ్రద్ధ, కేరింగ్, ఇతరులతో తన గురించి షేర్ చేసుకునే విషయాలు, ప్రేమ, ద్వేషం, అనుమానం వ్యక్తం చేయడం ఇలాంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అతడు తనకు సరైన జోడీ అనుకుంటేనే యాక్సెప్ట్ చేస్తారట. వీటిల్లో ఏ ఒక్క విషయంలో అబ్బాయి ఫెయిల్ అయినా ఇక అతడు దేవదాసుగా మారినా పట్టించుకోరట.

Advertisement

Next Story

Most Viewed