యువత ఆలోచనల్లో ‘న్యూ సిచ్యువేషన్ షిప్’.. వ్యక్తిగత, ఉద్యోగ జీవితంపై సానుకూల ప్రభావం

by Dishafeatures2 |
యువత ఆలోచనల్లో ‘న్యూ సిచ్యువేషన్ షిప్’.. వ్యక్తిగత, ఉద్యోగ జీవితంపై సానుకూల ప్రభావం
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోల్చితే ఈ జనరేషన్ ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి. కాస్త దూకుడుగా అనిపించినప్పటికీ నేటి యువతీ యువకులు తమ వ్యక్తిగత జీవితంతోపాటు కార్యాలయ వాతావరణంలోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. వర్క్‌పై ఫోకస్ చేయడం, ఎంప్లాయీస్ రికగ్నేషన్ ప్రోగ్రామ్స్‌ను సెట్ చేయడం వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటున్నాయి. అలాగే పాత కొత్త తరాల మధ్య ఇన్ఫర్మేషన్ గ్యాప్ ప్రాబ్లమ్స్‌ను క్లియర్ చేయడంలో ఈతరం చాలా ఫాస్టుగా ఉంటోంది.

వర్క్ ప్రయారిటీస్‌పై ఫోకస్

యువతరానికి పని అనుభవం ఉండదు కాబట్టి ప్రారంభంలో ప్రొడక్టివిటీపై నెగెటివ్ ప్రభావం పడుతుందనే ఆలోచనలకు ఇప్పుడు కాలం చెల్లింది. ఎందుకంటే వారిప్పుడు పనిలోకి ప్రవేశించే ముందే తగిన స్కిల్స్ నేర్చుకొని ఉంటున్నారు. గతంలో మాదిరి ఆయా రంగాల్లో అప్రెంటిస్ ట్రైనింగ్‌లకు నెలలు, సంవత్సరాల తరబడి సమయం కేటాయించాల్సిన అవసరం ఇప్పుడు లేకుండా పోతోంది. అంతేకాకుండా వర్క్ ప్రయారిటీని అర్థం చేసుకోవడంలో, దానికి విలువను ఇస్తూ ప్రొడక్టివిటీని పెంచడంలో ఈతరం ముందుంటున్నది.

వాల్యూస్ అండ్ పర్సనల్ గ్రోత్

మేనేజ్‌మెంట్ డిస్కషన్‌లో పక్షపాతాన్ని తగ్గించడంపై ఫోకస్ పెట్టిన థాట్ ఎక్స్‌ఛేంజ్-2022 రిపోర్ట్ ప్రకారం.. వర్క్ ఫోర్స్‌లోకి ఎంటరవుతున్న యువతలో 96 శాతం మంది పనిని విలువైనది భావిస్తున్నారు. కొత్తగా ఆలోచించడం, కొత్త దనాన్ని చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే 79 శాతం మంది తమ పర్సనల్ గ్రోత్‌తో పాటు ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌ను సమంగా, బలంగా కోరుకుంటున్నారు. ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తి జీవితాన్ని సమతుల్యంగా నడిపించే పాజిటివ్ ఆలోచనలతో ఉంటున్నారు.

జనరేషన్ గ్యాప్‌ను అర్థం చేసుకోవడం

సీనియర్లతో పోల్చినప్పుడు ఈతరం యువతకు వర్క్‌పట్ల అవగాహన విషయంలో తేడాలు ఉంటాయని చెప్తుంటారు. కానీ గతంలో పోల్చితే ఈ సిచ్యువేషన్‌షిప్‌లో మార్పు వచ్చిందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ సోర్స్ పెరిగాయి. ఇంటర్నెట్ యుగంలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. వర్క్ ఫోర్స్‌లోకి వచ్చే ముందే యువతీ యువకులు తగిన అవగాహనతో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఓల్డ్ జనరేషన్ అండ్ మిలీనియర్స్‌తో కలిసిపోవడంలో, వర్క్‌ప్లేస్ ప్రొడక్టివిటీని పెంచడంలో ఈతరం యువత కీ రోల్ పోషిస్తోంది. పని, జీవితం, ప్రొడక్టివిటీ, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ ప్రయారిటీస్‌తో ముందుకు వెళ్తూ సరికొత్త రూల్ బుక్‌ను క్రియేట్ చేస్తోంది.

Next Story

Most Viewed