ఈ మాంసాహార పక్షి సో డిఫరెంట్.. పాములు కనిపిస్తే అస్సలు వదలదు!

by Javid Pasha |
ఈ మాంసాహార పక్షి సో డిఫరెంట్.. పాములు కనిపిస్తే అస్సలు వదలదు!
X

దిశ, ఫీచర్స్ :పక్షులు ఎక్కువగా పండ్లను, కీటకాలను తింటుంటాయి. మరి కొన్ని రకాల పక్షులు చేపలు, కోడి పిల్లలు, ఎలుకలు, జంతు మాంసాన్ని కూడా తింటాయి.అయితే విషపూరితమైన పాములను తినే పక్షి గురించి మీరు విన్నారా? అమెరికా, మెక్సికోలలో ఎక్కువగా కనిపించే ఈ అరుదైన పక్షి పేరు రోడ్ రన్నర్ (Roadrunner). ఎంతటి విషపూరితమైన పామునైనా సరే ఇష్టంగా తినేస్తుందట. పైగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే ఎడారి ప్రాంతాల్లో కనిపించే ర్యాటిల్ స్నేక్స్ అంటే వీటికి చాలా ఇష్టమట.

వాస్తవానికి రోడ్ రన్నర్ పక్షులు కోకిల జాతికి చెందినవి. కానీ ఇవి పూర్తిగా మాంసాహారులు. కలర్, పరిమాణం కూడా భిన్నంగా ఉంటాయి. రెండు మీటర్ల పొడవున్న పాములను కూడా ఈజీగా వేటాడి తినేస్తాయి. వరల్డ్ వైడ్‌గా రెండు రకాల రోడ్ రన్నర్ పక్షులు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఒకటి గ్రేటర్ రోడ్ రన్నర్ కాగా, రెండవది లెస్సర్ రోడ్ రన్నర్. గ్రేటర్ రోడ్ రన్నర్స్ సుమారు రెండు అడుగుల పొడవు ఉంటాయి. అలాగే ఇవి నలుపు, తెలుపు, గోధుమ రంగుల ఈకలను కలిగి ఉంటాయి. ఇక లెస్సర్ రోడ్ రన్నర్స్ అయితే టాన్ కలర్‌లో మాత్రమే ఉంటాయి.

అయితే గ్రేటర్ రోడ్ రన్నర్స్ ఎక్కువగా సౌత్ వెస్ట్రన్ అమెరికాలో, మెక్సికోలోని ఏడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. లెస్సర్ రోడ్ రన్నర్స్ విషయానికి వస్తే సెంట్రల్ అమెరికా, దక్షిణ, పశ్చిమ మెక్సికోలల్లో కనిపిస్తుంటాయి. కాగా రోడ్ రన్నర్స్ చాలా వేగంగా తమ ఆహారంకోసం వేటాడుతాయట. ఇవి గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎడారిలోని ముళ్ల పొదల మధ్య ఎక్కువగా గూళ్లు చేసుకొని నివసిస్తుంటాయి. కీటకాలు, పాములు వంటివి కనిపిస్తే వేగంగా దూసుకెళ్లి నోటితో పట్టుకొని, ముక్కుతో పొడిచి చంపి తినేస్తాయి. కాగా వీటి ప్రధాన మాంసాహారం పాములేనట.

Advertisement

Next Story