- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్వతారోహణ చేస్తే.. అంత్యక్రియల ఖర్చు డిపాజిట్ చేయాల్సిందే!
దిశ, ఫీచర్స్ : సాహసికుల బకెట్ లిస్ట్‌లో 'పర్వతారోహణ' తప్పనిసరిగా ఉంటుంది. వీరంతా ఆయా రుతువులు, కాలాల ప్రకారం తాము అధిరోహించే మౌంటెయిన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ ఈసారి యూరప్‌లోని 'మోంట్ బ్లాంక్' ఎక్కాలంటే మాత్రం ముందుగానే రూ. 12,16,785/- (€15,000) డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఇంతకీ ఆ డబ్బులు ఎందుకోసమో తెలుసా?
పర్వతారోహకులు కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి. ఎలాంటి అవగాహన లేకుండా మౌంటెనింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కానీ అనేకమంది ఔత్సాహికులు దీన్ని ఒక ఫ్యాషన్ గేమ్‌గా చూస్తూ ఎలాంటి అనుభవం లేకున్నా పర్వతారోహణకు సిద్ధమవుతున్నారు. అందుకే క్లైంబింగ్ చేయాలనుకునే వ్యక్తులు డిపాజిట్ ఫీజుగా రూ. 12,16,785 (15 వేల యూరోలు) చెల్లించాలని సెయింట్ గెర్వైస్ లెస్-బెయిన్స్ మేయర్ జీన్-మార్క్ పీలెక్స్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశాడు. ఒకవేళ సదరు క్లైంబర్ ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా గాయపడితే ఆ మొత్తాన్ని అతని రెస్క్యూ ఖర్చుకు లేదా అంత్యక్రియలకు వినియోగిస్తామని పేర్కొన్నాడు.
వాతావరణ పరిస్థితుల గురించి స్థానిక అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలను 'సూడో-పర్వతారోహకులు' విస్మరిస్తున్నందున అనేక దురదృష్టకర ప్రమాదాలకు దారితీస్తోందని మేయర్ వెల్లడించాడు. అందుకే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు తెలిపాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నందున ఈ మార్గంలో వెళ్లవద్దని స్థానిక యంత్రాంగం ప్రజలను కోరింది. ఎండ తీవ్రత కూడా పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని అన్నారు. కానీ ఈ నిర్ణయం ప్రకటించనప్పటి నుంచి మౌంటెనీర్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నవ వధువు ఆలోచనకు నెటిజన్లు ఫిదా.. పెళ్లైన వెంటనే అవి చూసేందుకు ప్లాన్