- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ ఇవే!
దిశ, వెబ్ డెస్క్: మనిషి శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను, టాక్సిన్స్ ను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అంతే కాకుండా .. ఎర్ర రక్తకణాలను ప్రేరేపించే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను విడుదలవుతుంది. కాబట్టి వీటి పనితీరును మనం మందగించకుండా చూసుకోవాలి. కిడ్నీలు మంచిగా ఉండాలంటే.. ముందు సరిపడా మంచినీరు తీసుకోవాలి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఈ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం..
పాలకూర
పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ B9 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తాయి.
బాదం
బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వీటిల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగానే తీసుకోవాలి.
క్వినోవా
క్వినోవాలో ప్రొటీన్, ఫైబర్, అమైవో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అన్నం, రోటీలకు బదులుగా వీటిని తీసుకోవచ్చు.
బ్లూబెర్రీస్
బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. కిడ్నీలకు జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
Read More: తల్లిపాలు అందని శిశువుల్లో తగ్గుతున్న ఇమ్యూనిటీ పవర్.. ఏం చేయాలో తెలుసా?