Foods: ముఖంపై ముడతలు పోగొట్టే ఫుడ్స్ ఇవే

by Prasanna |
Foods: ముఖంపై ముడతలు పోగొట్టే  ఫుడ్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా వయస్సు దాటితే వృద్ధాప్యం అనేది సహజమే. కానీ, ఇటీవలి కాలంలో తక్కువ వయస్సు ఉన్నవారు కూడా ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. మనలో కొందరు యౌవనంగా కనిపించాలనుకుంటారు. బిజీ లైఫ్, ఫాస్ట్ ఫుడ్స్ వలన ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. అయితే, డైట్‌లో వీటిని చేర్చుకుంటే ముఖం పై ముడతలను తొలగించవచ్చు.

వారంలో మూడు సార్లు పాలకూర, ఆకు కూరలు, కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే, వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. పాలకూరను తినడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ముఖంపై ముడతలు కూడా పోతాయి.

అవకాడో మంచి ఫుడ్ .. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వలన చర్మంపై డెడ్ సెల్స్ తగ్గుతాయి. పప్పులు తినడం వల్ల శరీరానికి అనేక లాభాలున్నాయి. పప్పులు రోజూ తీసుకోవడం వలన మచ్చలు పోతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story