ఇండియాలో రుచికరమైన రెస్టారెంట్లే లేవట.. పోటీలో నిలవని భారతీయ హోటల్స్!

by Dishaweb |   ( Updated:2023-06-24 10:45:31.0  )
ఇండియాలో రుచికరమైన రెస్టారెంట్లే లేవట.. పోటీలో నిలవని భారతీయ హోటల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: రుచికరమైన భోజనం ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇంట్లో ఎన్ని రకాలైన వంటకాలు చేసిన కానీ బయట హోటల్స్, రెస్టారెంట్ల వైపు మాత్రం చూడకుండా ఉండలేరు భోజన ప్రియులు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక పోటీలను నిర్వహిస్తున్నట్టుగానే అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా కోసం పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని అత్యుత్తమ 50 రెస్టారెంట్ల జాబితాను ప్రకటించారు. 1,080 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన ప్యానెల్ కమిటీ ఆడిటింగ్ చేసి ఓట్ల ఆధారంగా ఈ లిస్టు విడుదల చేసింది. వాటిలో పెరు రాజధాని లిమాలోని సెంట్రల్ రెస్టారెంట్ నంబర్ స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలోని డిస్క్రూటర్ రెస్టారెంట్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని 50 బెస్ట్ రెస్టారెంట్లు ఇండియా నుంచి ఒక్కటి కూడా లేకపోవడం బాధకరమైన విషయం.

Advertisement

Next Story

Most Viewed