- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాలామంది తమకు ఇష్టమైన ప్రదేశంలోనే కూర్చుంటారు.. ఎందుకో తెలుసా?
దిశ, ఫీచర్స్: ఐదేళ్లలోపు పిల్లల్ని మీరెప్పుడైనా గమనించారా? వారు అమ్మ ఒడిలో కూర్చోవడానికి, పడుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. అక్కడ తాము తప్ప మరొకరు కూర్చోవద్దని భావిస్తుంటారు. సరదాకు అమ్మ ఇతర పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకుంటే అస్సలు సహించరు. అక్కడి నుంచి వారిని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంటారు. అమ్మ ఒడి తమకే సొంతమనే ధైర్యంతో వాదిస్తుంటారు. ఎందుకంటే అది వారికి అత్యంత ఇష్టమైన, సౌకర్యవంతమైన ప్రదేశం. అలాగే ఇంట్లో తాతయ్య కూర్చునే అరుగు, కిచెన్‌లో అమ్మకూర్చునే ప్లేస్ అంటూ ప్రత్యేకంగా గుర్తిస్తుంటాం. ఇలా పిల్లలైనా, పెద్దలైనా ఎక్కువగా తమకు ఇష్టమైన ప్రదేశాల్లో తప్ప మరో చోట కూర్చోవడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే తమ ఫేవరెట్ సోఫాలో, బెడ్‌పై కూర్చునే విషయంలో గొడవపడుతుంటారు కూడా. కొన్ని చోట్ల, కొన్ని దేశాల్లో మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఈ విధమైన ప్రవర్తలు ఉంటాయని ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ వన్‌పోల్ 2000 మందిపై నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
మూడింట రెండొంతుల మంది తమ ఇళ్లలో ప్రత్యేకంగా ఒక విషయంపై అబ్సెసివ్‌గా ఉంటున్నారని, 66 శాతం మంది అనధికారికంగా సీటింగ్‌ను కలిగి ఉంటారని సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ప్రజలు తమకు ఇష్టమైన ప్రదేశాలకు చాలా విధేయులుగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా సరే తమ ‘స్పాట్’లో రోజుకూ రెండుసార్లైనా కూర్చోనిదే వారికి పొద్దుగడవదు. ప్రపంచంలో ఎక్కువమంది తమకు ఇష్టమైన ఫేవర్ స్పాట్‌గా కిచెన్‌లోని టేబుల్ లేదా సోఫాను కలిగి ఉంటున్నారట. ఇక 55 శాతం మంది జీవిత కాలంలో తమకు ఇష్టమైన ప్రదేశంలో తప్ప మరోచోట కూర్చోవడం అసౌకర్యంగా భావిస్తారట. చివరికి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా తమకు ఇష్టమైన ప్రదేశంలోకి తాము కూర్చునే కుర్చీని, మంచాన్ని తరలించాలని ఎక్కువమంది కోరుతుంటారు. ఈ విధమైన ఆసక్తి, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రపచంలో దాదాపు 73 శాతం మంది తమ ఇంటిని వదులుకోవడానికి ఇష్టడపరు. ఇష్టమైన అరుగును, సోఫాను, మంచాన్ని కోల్పోవడానికి అస్సలు ఇష్టపడరు. అవి పాతబడినా రిపేరు చేయించుకొని వాడతారే తప్ప వదులుకోవడానికి సిద్ధపడరు. కారణం అవి తమకు సౌకర్యంగా భావించడమే.
Read More..
ప్రేమలో సమస్యలు వస్తున్నాయా.. అయితే ఈ పని చేస్తే ఎప్పటికీ విడిపోరు?