- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల సోషల్ బిహేవియర్‌పై ప్రభావం చూపుతున్న AI టెక్నాలజీ
దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు దాని వాడకం విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏఐ వ్యవస్థలతో పనిచేయడంవల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం చాలా కీలకమని జార్జియా యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోక్ మాన్ టాంగ్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం పేర్కొన్నది. యునైటెడ్ స్టేట్స్, తైవాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా వివిధ దేశాలలోని ఉద్యోగులపై ఏఐ ఏ విధమైన ప్రభావం చూపుతుందో తెలుసుకునే లక్ష్యంతో ఈ బృందంలోని నిపుణులు తమ అధ్యయనం కొనసాగించారు. అయితే సమాజంలోని వివిధ అంశాలలో దాని ఏకీకరణ అభివృద్ధి చెందుతుండటంతో ప్రతికూల, సానుకూల ప్రభావాలు ఉంటున్నాయని కనుగొన్నారు.
కార్యాలయాల్లో కొన్ని పనుల నిర్వహణలో మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఏఐ వ్యవస్థలతో తరచుగా నిమగ్నమయ్యే ఉద్యోగులు ఒంటరితనాన్ని అనుభవించడం, మద్యానికి బానిసలవడం పెరుగుతోందని, చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. అందుకే ఏఐ వల్ల కలిగి ప్రయోజనాలు, అప్రయోజనాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. లోపాలను సరిదిద్ది ప్రయోజనాలను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన మరో రీసెర్చ్ స్టడీ ప్రకారం కూడా ఏఐ వ్యవస్థలు వ్యక్తుల సోషల్ బిహేవియర్‌పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. ఫలితంగా పలువురు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏఐ సిస్టమ్స్‌పై పనిచేస్తున్న వారిలో దాదాపు సగంమంది మైగ్రేన్, నిద్రలేమి, బోన్ డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
Read More: గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి ఆహార ఎంపికలు కీలకం.. అధ్యయనంలో వెల్లడి