65 ఏళ్లుగా రాఖీ పండుగ జరుపుకోని రాష్ట్రం.. సిస్టర్స్ ఆస్తి అగినందుకు ఊరు విడిచిపెట్టిన బ్రదర్స్?

by Anjali |
65 ఏళ్లుగా రాఖీ పండుగ జరుపుకోని రాష్ట్రం.. సిస్టర్స్ ఆస్తి అగినందుకు ఊరు విడిచిపెట్టిన బ్రదర్స్?
X

దిశ, ఫీచర్స్: హిందువులంతా ఆనందోత్సవాలతో రాఖీ పండుగ చేసుకుంటున్నారు. సోదరీమణులంతా తమ తమ పుట్టింటికి చేరుకుని అన్నాదమ్ములకు రాఖీ కడుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ రాఖీ ఓ రాష్ట్రంలో మాత్రం జరుపుకోరట. రాఖీ సెలబ్రేట్ చేసుకున్నట్లైతే అనర్థం జరుగుతుందని నమ్ముతాయట. దశాబ్దాలుగా రాఖీని సెలబ్రేట్ చేసుకోని గ్రామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నాదమ్ముళ్లకు రాఖీ కడితే విషాద ఘటనలు జరుగుతాయని ఉత్తరప్రదేశ్‌లోని ధౌలానా, జగత్‌పూర్వ, సురానా, బైనీపూర్‌ చాక్‌ తదితర గ్రామ ప్రజలు విశ్వసిస్తున్నారట. ఏకంగా జగత్‌‌పూర్వలో రాఖీని 65 ఏళ్లుగా చేసుకోవడం లేదట. 1955 లో రాఖీ కట్టాక ఓ వ్యక్తం మరణించారట. ఇక అప్పటి నుంచి కీడు జరుగుతుందని భావించారట. తర్వాత 10 సంత్సరాల తర్వాత పండుగ జరుపుకున్నారట. కానీ మళ్లీ విషాదం జరిగింది. దీంతో ఇక రాఖీ పండుగ జరుపుకునేదే లేదని గ్రామ ప్రజలు కంకణం కట్టుకుని కూర్చున్నారట. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో రాఖీ నాడే అప్పటి రాజు మహ్మద్ ఘోరీ సురానా గ్రామంపై దండయాత్ర చేశారట.

ఇద్దరు పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడగా.. గ్రామం మొత్తం మరణించిందట. ఆ పిల్లు కొన్నేళ్ల తర్వాత రాఖీ జరుపుకుంటే అందులో ఒకరు దివ్యాంగుడు అయ్యాడట. ఇక బైనీపూర్ చాక్ లో రాఖీ కట్టాక అన్నాదమ్ములు తమ సోదరీమణులు ఆస్తులు ఇచ్చుకుంటూ పోవడంతో మొత్తమే ఆర్థికంగా వెనకబడిపోయారట. రాఖీ కట్టి ఆస్తి అడగడంతో చివరకు తమ విలేజ్ ను వదిలి వెళ్లారట.

Advertisement

Next Story

Most Viewed