- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'డార్క్ ఎనర్జీ'కి మూలం విశ్వంలోని 'బ్లాక్ హోల్స్'
దిశ, ఫీచర్స్ : భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో పగలు, రాత్రి ఏర్పడుతుందనేది తెలుసు కానీ ఆ చీకటిని మరింతగా వ్యాపింపజేసి, శక్తిగా మార్చే మరో ప్రక్రియ కూడా ఉందని ఎందరికి తెలుసు. విశ్వంలోని గెలాక్సీలలో ఉండే కొన్ని రకాల కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) విశ్వంలో చీకటి విస్తరణకు కారణం అవుతాయని కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. చీకటి ఏర్పడి అది క్రమంగా డార్క్ ఎనర్జీగా విస్తరించేందుకు గల కారణాలను తెలుసుకునే క్రమంలో తొమ్మిది దేశాలకు చెందిన 17 మందితో కూడిన పరిశోధకుల బృందం రీసెర్చ్ కొనసాగించింది. ఈ సందర్భంగా విశ్వ చరిత్రలోని ద్రవ్యరాశిలో 10 ఆర్డర్‌ల మాగ్నిట్యూడ్‌ను విస్తరిస్తున్న బ్లాక్ హోల్స్‌ను కనుగొన్నారు.
కృష్ణ బిలమే మెయిన్ సోర్స్
కృష్ణ బిలం డార్క్ ఎనర్జీకి మూలమని, విశ్వం విస్తరణ వెనుక ఉన్న శక్తిని కనుగొనడానికి వివిధ గెలాక్సీలలోని బ్లాక్ హోల్స్ వృద్ధి రేటును అంతర్జాతీయ పరిశోధకుల బృందం పోల్చి చూసింది. డార్క్ ఎనర్జీ కోర్లను కలిగి ఉన్న బ్లాక్ హోల్స్ విశ్వంలో ఎనర్జీని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 9 దేశాల్లోని 17 మంది సైంటిస్టులు వెల్లడించిన పరిశోధనల వివరాలను ''ది ఆస్ట్రో ఫిజికల్ జర్నల్ అండ్ ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్'' అనే రెండు వేదికల్లో పబ్లిష్ అయ్యాయి. ఇందులో అనేక విషయాలను బృందంలోని సభ్యులు పంచుకున్నారు.
హవాయి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులలో ఒకరైన డంకన్ ఫర్రా మాట్లాడుతూ.. ''బ్లాక్ హోల్స్ డార్క్ ఎనర్జీకి మూలమని మేం ప్రతిపాదించాం. పెద్ద నక్షత్రాల వినాశనం, కూలిపోయే సమయంలో సాధారణ పదార్థం కుదించబడినప్పుడు ఈ చీకటి శక్తిగా ఉత్పత్తి అవుతోంది'' అని వెల్లడించాడు ఫర్రా. అయితే విశ్వం విస్తరిస్తున్న కొద్దీ బ్లాక్ హోల్స్ పెరిగితే ఈ ఫలితాలను వివరించవచ్చని పరిశోధకులు తెలిపారు. విశ్వంలో విస్తరిస్తున్న బ్లాక్ హోల్స్‌ను వారు మ్యాగ్నిట్యూడ్స్ ద్వారా కనుగొన్నారు.
డార్క్ ఎనర్జీకి అనుకూలించని కెర్ బ్లాక్ హోల్
కెర్ బ్లాక్ హోల్‌ను పరిశీలించినప్పుడు దాని ఎండింగ్ (అనంతం) విశ్వంలో విస్తరణకు అనుకూలంగా లేదని సైంటిస్టులు తెలుసుకున్నారు. దీనివద్ద విశ్వం విస్తరణతో బ్లాక్ హోల్ గురుత్వాకర్షణకు లోనవుతుందని తెలిసింది. పరిశోధకులు కొన్ని 'యంగ్ గెలాక్సీ'లలోని బ్లాక్ హోల్స్ ద్రవ్యరాశిని నిద్రాణమైన గెలాక్సీలలోని బ్లాక్ హోల్ ద్రవ్యరాశితో పోల్చారు. యంగ్ గెలాక్సీలలో సమీపంలోని నక్షత్రాలు చుట్టూ ఉన్న విశ్వ సంబంధిత స్థానాన్ని ఆక్రమించడం ద్వారా బ్లాక్ హోల్స్ పెరుగుతున్నాయి. నిద్రాణమైన గెలాక్సీలలోని బ్లాక్ హోల్స్ ఊహించిన దానికంటే ఏడు నుంచి 20 రెట్లు అధికంగా ఉన్నాయని కూడా సైంటిస్టులు తెలుసుకున్నారు.
అయితే కృష్ణ బిలం డార్క్ ఎనర్జీకి మూలం అనే వాదనను కూడా కొంతమంది నిపుణుల నుంచి వ్యతిరేకిస్తున్నారు. కోపెన్‌హాగన్‌లోని నీల్స్ బోర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన విటర్ కార్డోస్ (vitor Cardoso) మాట్లాడుతూ.. ''బ్లాక్ హోల్స్ బిలియన్ల సంవత్సరాల క్రితం కంటే నేడు భిన్నంగా పరిణామం చెందుతున్నాయి. వాటి విస్తరణ కూడా సులభం. అంతేకాని దాని నుంచి డార్క్ ఎనర్జీ ఉత్పన్నం అయ్యే అకాశం లేదు'' అని అభిప్రాయపడ్డారు. దీనిని బట్టి విశ్వంలో బ్లాక్ హోల్స్ డార్క్ ఎనర్జీని విస్తరించే అవకాశాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.