- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Snake Bite: ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌ను కరిచిన పాము.. లాగినా కూడా విడవలేదు .. సంచలనం రేపుతోన్న వీడియో

దిశ, వెబ్ డెస్క్: వన్యప్రాణుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిలో, పాముల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పాము పేరు వినగానే.. మనలో చాలా మంది భయపడి పారిపోతుంటారు. మన ఇళ్ళలో చిన్న పాము కనిపించిన దాన్ని చంపే వరకు ప్రశాంతంగా ఉండలేము. అలాంటి భయంకరమైన పాములతో కొందరు సరదగా ఆడుతూ.. ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాము.
అయితే, తాజాగా ఓ యువకుడు పాముతో ఆడుకోవాలని చూశాడు. కానీ, ఆ స్నేక్ ఏకంగా అతడి ప్రైవేట్ పార్ట్‌నే కరిచి ఝలక్ ఇచ్చింది. ఇండోనేషియాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ని అంగరా షోజీని పాము కరించింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. షోజీ పాములతో ఇప్పటికే ఎన్నో వీడియోలను చేశాడు. ఇక , తాజాగా ఓ కొత్త వీడియోను షేర్ చేశాడు. దీనిని చూసిన వారు షాక్ అయి భయపడుతున్నారు.
పాముల వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అంగరా పెట్టిన ఈ వీడియో సంచలనం రేపుతుంది. తాను చేసిన ఈ రిస్కి స్టంట్ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ వీడియోలో పాము తన ప్రైవేట్ పార్ట్ ని గట్టిగా పట్టుకుని ఉంది.. ఎంత లాగినా కూడా అది పట్టు విడవకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. తాను, ఈ పామును లాగడానికి చాలా తిప్పలు పడ్డాడు.. అయిన ప్రయోజనం లేదు. ఆ సమయంలో అంగరా భాదతో కుమిలిపోయాడు. దీనిని చూసిన నెటిజన్స్ " అన్ని పాములు ఒకేలా ఉండవు.. బ్రో కొంచం జాగ్రత్త " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.