వామ్మో.. అక్కడ పుచ్చకాయ ధర రూ. 5 లక్షలు.. స్పెషల్ ఏమిటంటే?

by samatah |   ( Updated:2023-04-25 11:11:36.0  )
వామ్మో.. అక్కడ పుచ్చకాయ ధర రూ. 5 లక్షలు.. స్పెషల్ ఏమిటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా పుచ్చకాయ తినడానికి ఇష్టపడుతారు. అంతే కాకుండా వేసవిలో దీన్నీ తినడం వలన డీహైడ్రేషన్ లాంటి సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. అయితే ఎక్కడైనా పుచ్చకాయ ధర రూ.20 లేదా 50 ఉంటుంది. కానీ అక్కడ ఏకంగా 5 లక్షలు ఉంది.. ఒక పుచ్చకాయ ధర. పుచ్చకాయ ధర అంత ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖరీదైన పండ్లను పండించే దేశాల్లో జపాన్ ఒకటి. అక్కడ రకరకాల పుచ్చకాయలు పండిస్తున్నారు. వాటిలో ఒకటి డెన్సుకే పుచ్చకాయ. దీన్ని పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఏమిటంటే?.. ఇది చూడటానికి కూడా బాగుంటుందంట అలాగే ఆరు నుంచి ఏడు కిలలో బరువు ఉండే ఇది ఎర్రగా జ్యూసిగా ఉంటుంది. అంతే కాకుండా దీని రుచి కూడా చాలా బాగుంటుందంట. తియ్యగా కరకరలాడుతూ, రవ్వ రవ్వగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో గింజలు కూడా చాలా చిన్నగా ఉంటాయంట. అందువలన ఈజీగా తినవచ్చు.

అయితే చాలా వరకు ఈ పుచ్చకాయలను తినడానికి కొనరంట, ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తారంట. ఎందుకంటే ఈ పుచ్చకాయలు ఎన్ని కావాలంటే అన్ని లభించవు. పండిన వాటికి విపరీతమైన డిమాండ్ ఉంటుందంట. హొక్కాయిడోలో వాతావరణం ప్రత్యేకమైనది. అక్కడి భూమి కూడా సారవంతమైనది. అందువల్ల అక్కడ మాత్రమే వీటిని పండిస్తుంటారు.

Also Read..

గుమ్మడికాయ తింటే.. ఇన్ని రకాల జబ్బులు మాయమా? అవి ఏంటో తెలుసా?

Advertisement

Next Story