వరల్డ్ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సనల్ స్పేస్.. ఎక్కడుందో తెలుసా?

by samatah |
వరల్డ్ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సనల్ స్పేస్.. ఎక్కడుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని అద్భుతాలు మనల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. మరికొన్ని ఆశ్చర్యంతో పాటు మధురానుభూతిని కలిగిస్తాయి. అటువంటి వరల్డ్ మోస్ట్ బ్యూటీఫుల్ పబ్లిక్ పర్సనల్ స్పేస్ ఒకటి చైనాలో ఉంది. ఇక్కడి నాన్‌జింగ్‌ డెజి ప్లాజా షాపింగ్‌మాల్‌లోని ఆరవ అంతస్తులో గల అందమైన ప్యాలెస్‌ను తలపించే ఆ ప్రదేశం మరేదో కాదు, అదొక ఆకర్షణీయమైన పబ్లిక్ బాత్ రూమ్. షాంఘైకి చెందిన X+లివింగ్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని రూపొందించింది. ఇందులోకి వెళ్తే ఏదో అందమైన ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందట. విశాలమైన ఈ పర్సనల్ స్పేస్‌లో గోడల నుంచి వేలాడే అందమైన తీగలు, మొక్కలతో నిండిన పొడవైన కారిడార్‌ చూపరులను ఆకట్టుకుంటుంది. ఇది ‘ఇమ్మర్సివ్ వాక్-త్రూ-ఎ-గార్డెన్ అనుభవం’గా రూపొందించబడింది.

డెజి ప్లాజాలోని ఫేమస్ పబ్లిక్ బాత్ అండ్ వాష్‌రూమ్ పైకప్పు భాగంలో డజన్ల కొద్దీ మెరుస్తున్న వెలుగు జిలుగుల దీపాలు, నిగనిగలాడే కాంతిని నేలపైకి ప్రసరిస్తూ.. ప్రతిబింబిస్తూ ఆకట్టుకునే ఆకుపచ్చని అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. లోపలికి వెళ్తే అక్కడి నుంచి బయటకు రావాలని అనిపించదట. ఈ అందమైన కారిడార్ చివరిలోని ఒక సోఫా విచ్చుకున్న పుష్పాన్ని పోలిన డిజైనింగ్‌తో ఉంటుంది. కష్టమర్లు, సందర్శకులు అక్కడ కాసేపు కూర్చొని సేదతీరవచ్చు. తమ ఫ్రెండ్స్ కోసం ఇక్కడ వేచి ఉండవచ్చు. ఇక పురుషులు, మహిళల సౌకర్యాలు సపరేట్‌గా కస్టమ్ డెకర్‌ను కలిగి ఉంటాయి. ఫౌంటైన్-ఇన్‌స్పైర్డ్ వాష్‌బేసిన్స్ కూడా పిల్లలు, పెద్దలకు యూజ్ చేయగల ఎత్తులో, తగిన డిజైనింగ్‌తో అమర్చబడి ఉంటాయి. బిజీ అర్బన్ లైఫ్‌లో పబ్లిక్‌కు రిలాక్సేషన్ అందించే ఉద్దేశంతో ఈ వరల్డ్ మోస్ట్ బ్యూటీఫుల్ బాత్ రూమ్‌ను డిజైన్ చేసినట్లు దాని డిజైనర్ లి జియాంగ్ పేర్కొంటున్నాడు. డిజైన్ ప్రాసెస్‌లో తాము ఫంక్షనల్-ఓన్లీ స్పేస్‌గా కాకుండా, అందమైన అనుభూతిని కలిగించే బ్యూటిఫుల్ పర్సనల్ స్పేస్ కాన్సెప్ట్‌తో దానిని నిర్మించామని డెజి ప్లాజా షాపింగ్ మాల్‌ యాజమాన్యం అంటున్నది.

Read More: భార్య, భర్తల మధ్య చిచ్చు పెడుతున్న సెల్ ఫొన్.. ఎలానో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed