- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dangerous Village: భారతదేశంలో అత్యంత భయంకరమైన ఊరు.. శాస్త్రవేత్తలకే సవాల్ గా మారిన విలేజ్

దిశ, వెబ్ డెస్క్ : చీకటిలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు చిన్న శబ్దం వినిపించిన చాలా భయపడతాము. ఎవరో మన వెనుక నడుస్తున్నారని ఊహించుకుని ఆందోళన చెందుతుంటాము. ఇక అపార్టమెంటుల్లో ఉండేవారు అర్థరాత్రి ఒక్కరే వెళ్లాలంటే వణుక్కుంటూ వెళ్లాల్సిందే. ఖాళీ ఇళ్ళు, మనుషుల లేని ఊరిలో రాత్రిపూట ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఉహలకే భయంకరంగా ఉంది కదూ. కానీ, వాస్తవానికి అలాంటి గ్రామం మన దేశంలో ఉంది. అదే "హాంటెడ్ విలేజ్ ఆఫ్ ఇండియా" అనే కుల్తారా గ్రామం. దీని వెనుక ఉన్న భయానక రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ..
కుల్తారా ( Kuldhara Village ) రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలోని ఓ గ్రామం ఉంది. పాత కాలంలో వ్యాపారంలో రాణించిన బలివాల్ బ్రాహ్మణులు అక్కడ నివసించే వాళ్ళు. అయితే, దాదాపు 200 ఏళ్ల క్రితం ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కుల్తారాలోని ప్రజలు జాడ లేకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు. సలీం సింగ్ అనే రాజు కుల్తారాలోని పలివాల్ బ్రాహ్మణులకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను ఎలా అయిన పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు . కానీ అప్పటికే, ఆ యువతికి వేరే వారితో పెళ్లి కుదురుతుంది. దీంతో, ఆ ఊరి గ్రామస్థులు వారి వివాహానికి నిరాకరించారు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన రాజు.. ఆ ఊరిలోని ఉండే వారందర్ని చంపేస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు భయపడి సాయంత్రం కాగానే ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్లి పోయారట.
అంతే కాకుండా, వెళ్లే ముందు ఆ భూమిని బాగా తిట్టారని, ఆ ఊరిలో ఇంకెవరు ఉండటానికి వీల్లేదని శాపనార్థాలు పెట్టారని చెబుతుంటారు. వారి శాపం గట్టిగా తగిలిందని, ఆ గ్రామస్థులు వెళ్లిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఎవరూ అక్కడికి వెళ్ళలేకపోయారు. కథ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నపటికీ ఆ ఊరు చుట్టూ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ గ్రామస్తుల ఇళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటే నమ్ముతారా ? కానీ, ఇది నిజం.. కాకపోతే ఏ జీవి కూడా అక్కడ లేదు.. చివరికి మొక్కలు కూడా లేవు.. కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఈ విలేజ్ , శాస్త్రవేత్తలకు కూడా పెద్ద సవాల్ గా మారింది. పరిశోధనలు చేయాలని వెళ్లినా చేయకుండా వెనక్కి వచ్చేసిన పరిస్థితులే కనిపించాయని చరిత్ర చెబుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.