పహల్గామ్ దాడి..ఉగ్రవాదుల మరో వీడియో వైరల్

by Ajay kumar |
పహల్గామ్ దాడి..ఉగ్రవాదుల మరో వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప‌హ‌ల్గామ్ దాడికి సంబంధించి ప‌లు వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఓ చిన్నారి డ్యాన్స్ చేస్తుంటే వెన‌క నుండి ఉగ్ర‌వాదులుగా అనుమానిస్తున్న ఇద్ద‌రి వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అధికారులు వారిని గుర్తించే ప‌నిలో ఉండ‌గా తాజాగా మ‌రో వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉగ్ర‌దాడి జ‌రిపే ముందు ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు చెట్లు ఎక్కువగా ఉన్న బైస‌ర‌న్ ప్రాంతం వైపు నుండి ప‌ర్యాట‌కుల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వ‌స్తూనే వారు కాల్పులు జ‌ర‌పడం మొద‌లు పెట్టారు.

అక్క‌డే ఉన్న టూరిస్టులు అస‌లు ఏం జ‌రుగుతుంది అని చూసేలోపే ప్ర‌మాదం జ‌రిగిపోయింది. 26 మంది టూరిస్టుల‌ను హ‌త‌మార్చి ఉగ్ర‌వాదులు అక్క‌డ నుండి పారిపోయారు. వారి కోసం ఇండియ‌న్ ఆర్మీ గాలింపు మొద‌లు పెట్టింది. అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ ఘ‌ట‌న‌కు ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా కార‌ణ‌మైన వారిని వ‌దిలిపెట్టేదిలేద‌ని హెచ్చ‌రించారు. దీంతో ఉగ్ర‌వాదులు ప‌ట్టుబ‌డితే ఎలాంటి శిక్ష వేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.



Next Story

Most Viewed