- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
25 బార్లకు భారీగా దరఖాస్తులు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలోని రూరల్ ఏరియాలో 25 బార్లకు 1346 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సయిజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫీజ్ లక్ష రూపాయలు నిర్ణయించగా రూ.13 కోట్ల 46లక్షల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చేవూరి హరికిరణ్ శనివారం తెలిపారు. రద్దు చేసిన 40 బార్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నోటిఫికేషన్ ను మార్చి 30 వతేదిన ప్రకటించినట్లు తెలిపారు. ఎప్రిల్ 26వ తేదివరకు ధరఖాస్తులను స్వీకరిచినట్లుగా తెలిపారు. రూరల్ పరిధిలో ఉన్న 25 బార్లకు ధరఖాస్తులు స్వీకరించారు. అదిలాబాద్లో మూడు బార్లకు 61 దరఖాస్తులు, మంచిర్యాలలో ఒక బారుకు 15 ధరఖాస్తులు, జగిత్యాల జిల్లా కోరుట్లలో ఒక బార్కు 24 , వరంగల్ అర్బన్లో నాలుగు బార్లకు 491, ఖమ్మంలో 2 బార్లకు 145, నల్లగొండలో మిర్యాలగూడలో ఒక బారుకు 226, మహబూబ్ నగర్లో ఒక బార్ కు 56, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో ఒక బారుకు 15 దరఖాస్తులు , అలంపూర్లోలో ఒక బార్కు 4, నాగర కర్నూల్, అచ్చంపేట రెండు బార్లకు 18, మెదక్ ఒక బార్ కు 53, నిజామాబాద్ అర్మూర్లో ఒక బార్కు 8, వికారాబాద్ కొడంగల్లో ఒక బార్కు 9 దరఖాస్తులు, సరూర్నగర్ మీర్పేట్ బార్ కు 200 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. బార్లకు 29 వ తేదిన డ్రా తీయనున్నట్లు తెలిపారు.
బెల్లంపల్లికి ఒకే దరఖాస్తుతో గడువు పెంపు..
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి బార్కు ఒకే ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. బెల్లంపల్లిలోని బారు మే 5 వరకు దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఎక్సయిజ్ కమిషనర్ అదేశించారు. మే 5న వరకు వచ్చిన దరఖాస్తులను మే6న డ్రా ద్వారా బార్ షాపు కేటాయింపు జరుగుతుందని కమిషనర్ తెలిపారు. నోటిఫికేషన్ సమయంలో జిహెచ్ఎంసి పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో 15 బార్లకు దరఖాస్తులను తీసుకోలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బార్లకు మే మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.