- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధూమపానం చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పిన తాజా సర్వే.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు..!
దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో సిగరెట్, మధ్యం అలవాటు లేని వాళ్లు చాలా తక్కువ. వయసు, ఆడ, మగ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటికి అలవాటు పడుతున్నారు. దీంతో చాలా మంది అనారోగ్యాల కారణంగా మృత్యు వాత పడుతున్నారు. అయితే.. ఈ ధూమపానం, మధ్యపానం అలవాటు కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా డబ్బును కూడా వృధా చేసుకుంటున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. నార్మల్‌గా సిగరెట్లు కాల్చే వారి కంటే.. బాగా అలవాటు ఉన్న వారు రోజులో ఎలా లేదు అన్నా రెండు నుంచి మూడు సిగరెట్ పెట్టెలు కాల్చేస్తూ ఉంటారు. అయితే.. ఇలా భారీగా సిగరెట్లు కాల్చే వారికి ఓ శుభవార్త చెప్పింది తాజా సర్వే. అదేంటంటే..
సాధారణంగా ఒక సిగరెట్ పెట్టి ధర రూ. 300 ఉంది అనుకోండి. భారీగా సిగరెట్లు కాల్చేవారు రోజుకు రెండు నుంచి మూడు సిగరెట్ పెట్టెలు కాల్చేస్తారు. అంటే ఒక సిరగెట్ పెట్టి ఖరీదు రూ. 300 కాబట్టి ఒక రోజు వాళ్లు సిగరెట్ల కోసం చేసే ఖర్చు రూ. 600. ఇలా నెలకు రూ 18 వేలు ఈజీగా ఖర్చు చేస్తున్నారు. అంటే సంవత్సరానికి కేవలం వీరు సిగరెట్ల కోసం ఖర్చు పెట్టే మొత్తం దాదాపు రూ. 2,16,000 అని సర్వేలో తేలింది. ఇలా సిగరెట్లు లెక్కలేకుండా కాల్చేవారు ఆ అలవాటును మానుకోగలిగితే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా సేవ్ అవుతోంది. అంతే కాకుండా కోటీశ్వరులు కూడా అవొచ్చు అంటుంది ఆ సర్వే.