శరీరానికి నీరు అవసరమేకానీ.. ఈ సందర్భాల్లో తీసుకుంటే చాలా ప్రమాదం

by Prasanna |   ( Updated:2023-08-19 06:49:35.0  )
శరీరానికి నీరు అవసరమేకానీ.. ఈ సందర్భాల్లో తీసుకుంటే  చాలా ప్రమాదం
X

దిశ,వెబ్ డెస్క్: మన శరీరానికి తగినంత నీరు తీసుకోకపోతే ఎటువంటి పనులు జరగవు.. అన్నీ స్తంభించిపోతాయి. కాబట్టి నీరు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పాటించకపోతే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. మన శరీరంలో నీటి అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఓవర్ హైడ్రేషన్, డీ హైడ్రేషన్ రెండూ మన శరీరానికి హాని కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ ఇక్కడ చూద్దాం..

ఓవర్ హైడ్రేషన్ : అవసరానికి మించి నీరు తీసుకున్నప్పుడు ఓవర్ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. దీని వలన వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు,కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి శరీరానికి ఎంత నీరు కావాలో అంత నీరును మాత్రం తీసుకోండి.

డీహైడ్రేషన్: శరీరం అధికంగా తన ద్రవాలను కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. దీని కారణంగా చెమటలు, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. తగినంత నీరు తీసుకోకపోవడంవల్ల డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. డీహైడ్రేషన్ తీవ్రమైతే మూత్రపిండాలు విఫలమవుతాయి. ఇది ప్రాణాంతకమవుతుంది.

Read More: ఖాళీ కడుపుతో ఖర్జూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?

Advertisement

Next Story