గాలి పీల్చుకుంటున్న చెట్టు.. న‌మ్మ‌శ‌క్యంకాని షాకింగ్‌ వీడియో!

by Sumithra |   ( Updated:2023-10-10 11:37:34.0  )
గాలి పీల్చుకుంటున్న చెట్టు.. న‌మ్మ‌శ‌క్యంకాని షాకింగ్‌ వీడియో!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌కృతిలో ఎన్నో వింత‌లు. కొన్నింటిని చూస్తే, ఒళ్లు గగుర్పాటుకు లోన‌వుతుంది. సాధార‌ణంగా, చెట్టు మ‌నిషి శ్వాస‌కు ఆధారంగా ఉంటుంది. కాని, చెట్టు శ్వాస తీసుకోవ‌డం ఎప్పుడూ చూసుండ‌రు. అయితే, ఇంట‌ర్నెట్‌లో చెట్టు "శ్వాస" తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తే న‌మ్ముతారా?! ఈ "హెవింగ్" చెట్టు వింత ఫుటేజ్ చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. వైరల్ హాగ్ షేర్ చేసిన‌ ఈ విచిత్రమైన దృగ్విషయం వెనుక కార‌ణాలను కూడా తెలియ‌జేశారు. జూన్‌లో కెనడాలోని కాల్గరీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అప్పుడు, కాల్గరీలో 100 మి.మీ., అంచనాతో భారీ వర్షపాతం న‌మోద‌వ‌గా, ఆ స‌మ‌యంలో గంట‌కు 70-90 కిమీ/ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి" అని పోస్ట్ వివ‌రించింది. ఈ స‌మ‌యంలో గాలి తాకిడికి చెట్లు కూక‌టి వేళ్ల‌తో స‌హా పైకి లేస్తూ, కిందికి దిగుతూ ఉన్నాయి. అందులో ఓ చెట్టు ఇలా గాలి వ‌త్తిడికి గురై చీలి, భూమిలో నుండి పైకి, కిందికి క‌దులుతున్న‌ప్పుడు, ప్రమాదకర చెట్లకు సహాయం చేసే వ్యక్తి వీడియోను రికార్డ్ చేశారు. గాలి వీచడంతో ఇలా చెట్టు ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉందని ఆయన వివరించారు.

Advertisement

Next Story