- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
28 ఏళ్లుగా కొబ్బరి కాయ తినే బతుకుతున్నాడు..
దిశ, ఫీచర్స్: గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) చికిత్స కోసం 28 ఏళ్లుగా కొబ్బరికాయ మాత్రమే తింటున్నాడు కేరళ కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణన్ పాలయి. ఒక ఆహార ప్రియుడై ఉండి.. రెండు దశాబ్దాలుగా ఒకే ఒక్క వస్తువును తినడం నిజంగా గొప్ప విషయమే. కాగా, అది తనను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతుందని నమ్ముతున్నాడు. ఈ వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు కనీసం నిల్చునేందుకు శక్తిలేని పరిస్థితిలో ఉన్నానని, కొబ్బరికాయ తినడం మూలంగా ప్రస్తుతం బాగున్నానని, తాను ముందుకు సాగడానికి తినే ఏకైక పదార్థం ఇదేనని పేర్కొన్నాడు.
యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాలకృష్ణన్ స్థానిక క్లబ్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్. కాగా, 35 సంవత్సరాల వయస్సులో అతడు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అతను తిన్న ప్రతిసారీ.. ఆహారం అతని కడుపు నుంచి అన్నవాహికలోకి వెనక్కి నెట్టబడటంతో వాంతులు చేసుకునేవాడు. ఈ క్రమంలో అనేక ఆహారాలను ప్రయత్నించాడు. కానీ కొబ్బరి కాయ, కొబ్బరి నీరు మాత్రమే అతనికి మంచి అనుభూతిని కలిగించింది.
కాబట్టి అతను 28 సంవత్సరాలుగా వాటికి కట్టుబడి ఉన్నాడు. ‘నేను రోజూ కొబ్బరికాయలు తింటాను. నా కుటుంబం కూడా కొబ్బరి సాగుకు మారింది. గత 28 ఏళ్లుగా నేను ఇలాగే జీవించాను. కొబ్బరిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి నా బలాన్ని తిరిగి పొందడంలో సహాయపడ్డాయి. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ అయ్యాయి’ అని బాలకృష్ణన్ అన్నారు.