కపుల్స్‌ విడిపోవడానికి ఆ వస్తువే కారణం.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

by Prasanna |
కపుల్స్‌ విడిపోవడానికి ఆ వస్తువే కారణం.. తాజా పరిశోధనల్లో  షాకింగ్ నిజాలు
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చుట్టూ మనుషులు ఉన్నా, వారితో మాట్లాడకుండా ఫోన్ చూసుకోవడమే సరిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మనలో చాలా మంది ఇంట్రోవర్ట్స్‌గా నటిస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోవడం చాలా తప్పు. ఈ ఫోన్ల వల్ల పక్కన ఏమి జరుగుతుందో కూడా చూసుకోవడం లేదు. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇటీవల, జంటలు ఎవరి ఫోన్‌లతో వారు బిజీగా ఉంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం కూడా ఉండటం లేదు. అతిగా ఫోనును ఉపయోగించవద్దు. మొబైల్ ఫోను వల్ల వారికి ఇష్టమైన వారిని దూరం చేసుకుంటున్నారని తాజా పరిశోధనల్లో తేలింది.

చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వంటి వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జంటలు కలిసి కూర్చుని మాట్లాడుకునే రోజులే పోయాయి. ఒకరినొకరు పట్టించుకోకపోతే మళ్లీ వాదనలు, అపార్థాలు, తగాదాలు తలెత్తుతాయి. అప్పుడు జంటల మధ్య పరస్పర ప్రేమ ముగుస్తుంది. టెలిఫోన్ కారణంగా, ప్రజలు తమ జీవిత భాగస్వామిని, పిల్లలు ,స్నేహితులను నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు. ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా వారి మాటలను వినకుండా ఫోన్‌లలో స్క్రోలింగ్‌ చేస్తుంటారు.

ఇంట్లో మీ జీవిత భాగస్వామి మీతో మాట్లాడకుండా ఫోన్‌ చూసుకుంటూ ఉన్నప్పుడు అలా చేయవద్దని ముందు నెమ్మదిగా చెప్పండి. అంతేకానీ వారిపై అరవకూడదు. వాళ్లు ఏం చెబుతున్నారో కూడా ఒకసారి వినండి. మీరు వారిపై వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫోన్ పక్కన పెట్టమని వారిని కూల్‌గా అడగండి. ఇలా చేయడం వల్ల వారు మారే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed