Advertisement: డయేరియా, మలేరియా, డెంగ్యూ... ఈ యాడ్ చూస్తే భయంతో పోవాల్సిందే...

by Sujitha Rachapalli |
Advertisement: డయేరియా, మలేరియా, డెంగ్యూ... ఈ యాడ్ చూస్తే భయంతో పోవాల్సిందే...
X

దిశ, ఫీచర్స్: ఒక ప్రొడక్ట్ ను మార్కెటింగ్ చేయడంలో అడ్వర్టైజ్మెంట్ కీలకంగా పనిచేస్తుంది. ఆ వస్తువు ఎందుకు పనికి వస్తుంది? ఎలా పనికి వస్తుంది? ఏ విధంగా వినియోగించవచ్చు? అనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తుంది. కొన్ని యాడ్స్ మరింత క్రియేటివ్ గా ఉంటాయి. ఇట్టే జనాల్లోకి వెళ్లిపోతాయి. అలాంటి ప్రకటనలు రూపుదిద్దడంలో థాయ్ స్పెషల్ ప్లేస్ కొట్టేయగా.. డెంగ్యూ, మలేరియా, డయేరియాకు కారణమయ్యే దోమలను చంపేందుకు వాడే స్ప్రే ఎలా ప్రమోట్ చేశారో చూస్తే స్పెషల్ అప్లాజ్ ఇవ్వకుండా ఉండలేరు.

కిచెన్ లో దోమ, బొద్దింక, ఈగ తమ పని తాము చేసుకుంటూ పోతాయి. ఇంతలోనే అక్కడికి తండ్రీకొడుకులు చేతిలో సరుకులతో అక్కడికి చేరుకుంటారు. మీరు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరని.. అవి పోజులు కొడుతుంటాయి. దీంతో తండ్రి వెంటనే రూమ్ స్ప్రేను వాటిపై స్ప్రే చేస్తాడు. అవి నవ్వి ఊరుకుంటాయి. మళ్లీ గొప్పలు పోతూ మాట్లాడతాయి. దీంతో వెంటనే కొడుకు సదరు ప్రొడక్ట్ ను స్ప్రే చేయడంతో మూడు కిందపడి గిలగిల కొట్టుకుంటూ చనిపోతాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. యాడ్ ఐడియాకు ఫిదా అయిపోతున్నారు జనాలు.

(Video Credits To The Ad Network Channel)



Next Story