టార్జాన్ మూమెంట్.. కోతి మాదిరి చెట్లెక్కడంపై స్పానిష్ వ్యక్తి స్పెషల్ క్లాసెస్

by Hamsa |
టార్జాన్ మూమెంట్.. కోతి మాదిరి చెట్లెక్కడంపై స్పానిష్ వ్యక్తి స్పెషల్ క్లాసెస్
X

దిశ, ఫీచర్స్: మనుషులు కోతి నుంచి పుట్టారని అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ జీవి నుంచి ఆవిర్భవించిన మనం ఆ లక్షణాలు కోల్పోయామని అంటున్నాడు ఈ రియల్ టార్జాన్. అందుకే ' టార్జాన్ మూమెంట్ ' తో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోతి మాదిరిగా చెట్లు ఎక్కడం మూలంగా కలిగే శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తున్నాడు.

బార్సిలోనాకు చెందిన టార్జాన్ అని పిలవబడే విక్టర్ మాన్యుయెల్ ఫ్లీట్స్.. స్పానిష్ నగరంలోని పార్క్ డి లా సియుడాడెలాలో మంకీ - ఇన్ స్పైరెడ్ ట్రీ - క్లైంబింగ్ క్లాసెస్ తో అటెన్షన్ క్యాచ్ చేశాడు. పాపులర్ హాలీవుడ్ మూవీస్ మాదిరిగా చెట్లెక్కి కొమ్మ నుంచి కొమ్మకు దూకుతు.. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను ఓ కమ్యూనిటీగా మారుస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఆయన.. ఒక్కో వ్యక్తి నుంచి ఒక్కో క్లాస్ కు దాదాపు రూ. 1000 వసూల్ చేస్తున్నాడు. ఇక ఎక్కడానికి, స్వింగ్ చేయడానికి అనువైన కొమ్మలు కలిగిన కొన్ని చెట్లను గుర్తించిన టార్జాన్.. బోధన కోసం ఉపయోగిస్తున్నాడు.

"మేము జంతువులలాగా కొమ్మ నుంచి కొమ్మకు కదులుతాము. ఇది స్పోర్ట్స్ ప్రాక్టీస్ లాంటిదే. కానీ ఈ ప్రపంచంతో డిస్ కనెక్ట్ అయి ప్రకృతితో గుర్తించబడతారు. ఫ్లీట్స్ తరగతులు కేవలం శారీరక వ్యాయామాల గురించి మాత్రమే కాదు. అవి క్రీడా విభాగాలు మరియు మానసిక క్రమశిక్షణల సమ్మేళనం. ఒక జాతిగా మనం స్పష్టంగా మరచిపోయిన ఒక రకమైన కదలికకు అభ్యాసకులను దగ్గరగా తీసుకురావడానికి రూపొందించబడింది ' - రియల్ టార్జాన్

ఇక టార్జాన్ మూవ్‌మెంట్ అభిమానుల సంఘం పెరుగుతూనే ఉన్నప్పటికీ.. ఇదంతా ఒక జిమ్మిక్కు అని విమర్శించేవారు లేకపోలేదు. అందుకే విమర్శించే వ్యక్తులు వచ్చి ప్రయత్నించాలని సవాల్ విసిరిన టార్జాన్.. ఒక చెట్టు ఎక్కడం మనిషి ఇప్పటికే మర్చిపోవడం ఈ ఉద్యమానికి కారణమైందని సమాధానమిచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed