- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తోలు కూడా తీయని కప్పను అలాగే సర్వ్ చేస్తున్న రెస్టారెంట్.. చూస్తేనే వాంతులొచ్చేస్తాయ్..
దిశ, ఫీచర్స్: కొన్ని వంటకాల గురించి చెప్తే వెంటనే అసహ్యం వేస్తుంది. యాక్ .. ఇంత దారుణమైన తిండి తింటారా అనిపిస్తుంది. అలాంటిదే ఈ డిష్ కూడా. తైవానిస్ రెస్టారెంట్ సర్వ్ చేస్తున్న ఈ డిష్ పేరు ‘ఫ్రాగ్ ఫ్రాగ్ ఫ్రాగ్ రామెన్’. కాగా కట్ చేయని, పైన తోలు కూడా తీయని కప్పలను ఉడకబెట్టి వేడి వేడిగా సర్వ్ చేస్తుంటారు. యువాన్ రామెన్ అని పిలువబడే రెస్టారెంట్ ఈ వంటకాన్ని కొత్తగా మెనూలో యాడ్ చేయగా.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యులిన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కప్పలను తినడం కామన్. కానీ మరీ ఇంత రా మెటీరియల్ తినడాన్ని ఇష్టపడరు. అయితే ఈ రెస్టారెంట్ యజమాని మాత్రం ఈ విచిత్రమైన వంటకాన్ని కచ్చితంగా ఇష్టపడతారనే నమ్మకంతో ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి సరికొత్త పేరు పెట్టాలనుకుంటే సూచించవచ్చని కూడా నెటిజన్లను కోరాడు. పైగా మంగళవారం, బుధవారం మాత్రమే ఈ డిష్ అందుబాటులో ఉంటుందని.. ఒక్కో ప్లేట్ ధర దాదాపు రూ. 660 అని ప్రకటించాడు. ఇక ఇందులో సర్వ్ చేయబడిన కప్ప 200గ్రా ఉంటుండగా.. సూప్, నూడిల్స్, ఐస్ క్రీమ్‌తో కలిపి వడ్డించారు. ఇక దీన్ని ఫొటో తీయాలని అనుకున్నా సరే ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సిందే. రూ. 262 చెల్లించాకే పిక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ జనాల్లో ఈ డిష్‌కు ఆదరణ పెరిగినట్లయితే అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు రెస్టారెంట్ యజమానులు.
Read More: స్కిన్ ప్రాబ్లమ్స్‌తో గుండె జబ్బులు.. హెచ్చరిక సంకేతాలివే