పేషెంట్ డీఎన్‌ఏ ఆధారంగానే మందులు ఇవ్వాలి.. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్

by Hajipasha |   ( Updated:2023-02-07 18:01:06.0  )
పేషెంట్ డీఎన్‌ఏ ఆధారంగానే మందులు ఇవ్వాలి.. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా వైద్యులు, ఫార్మసిస్టులు రోగులకు ఒకే రకమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. కానీ, ప్రతీ ఒక్కరు మరొకరి నుంచి భిన్నంగా ఉంటారని, కావలసిన ప్రభావం పొందేందుకు వేరొక మోతాదులో అవసరం కావచ్చని వాదిస్తున్నారు పరిశోధకులు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తుంటాయని తెలిపారు. ఈ క్రమంలోనే డీఎన్‌ఏ ఆధారంగా ప్రత్యేకంగా మందులు కేటాయించడం మూలంగా 30 శాతం తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయని కనుగొన్న సైంటిస్టులు.. దీన్ని 'గ్రౌండ్ బ్రేకింగ్' అధ్యయనంగా పేర్కొన్నారు.

లైడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ (LUMC) పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం జన్యు సమాచారం ఆధారంగా మందులను సూచించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. వేర్వేరు DNA ప్రొఫైల్‌లు ఉన్న వ్యక్తులకు ఒకే మోతాదులో మందులను సూచించడం దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది లేదా చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే పరిశోధకులు డీఎన్ఏ మెడికేషన్ పాస్‌ను డెవలప్ చేశారు. రోగి జన్యు ప్రొఫైల్‌ను DNA ఆధారంగా విభిన్నంగా ప్రాసెస్ చేసే మందులతో అనుబంధించారు. వైద్యులు, ఫార్మసిస్ట్‌లు వారి DNA ఆధారంగా రోగులకు డోసేజ్ సెట్ చేయడానికి ఈ పాస్‌ను స్కాన్ చేయవచ్చు. ఏడు యూరోపియన్ దేశాల నుంచి సుమారు 7,000 మంది రోగులు ఈ ట్రయల్‌లో పాల్గొనగా.. ఆంకాలజీ, కార్డియాలజీ, సైకియాట్రీ, జనరల్ మెడిసిన్‌తో సహా అనేక రకాల వైద్య ప్రత్యేకతలను కవర్ చేసింది. ప్రామాణిక మోతాదు ఇచ్చిన రోగుల కంటే పాస్‌ను ఉపయోగించే రోగులు 30 శాతం తక్కువ తీవ్రమైన దుష్ప్రభావాలను అనుభవించినట్లు అధ్యయనం కనుగొంది.

ఇక రీసెర్చ్‌లో పాల్గొన్న అందరికీ 39 మందుల్లో ఒకటి సూచించబడింది. దీని ప్రాసెసింగ్ వ్యక్తి జన్యువులచే ప్రభావితం అవుతుండగా.. పరిశోధకులు 12 నిర్దిష్ట జన్యువులను పరిశీలించారు. మందులు ఎలా పనిచేస్తాయో ప్రభావితం చేసే 50 జన్యు వైవిధ్యాలను కనుగొన్నారు. చికిత్స తర్వాత 12 వారాల వరకు రోగులు ఎలాంటి దుష్ప్రభావాలను అనుభవించారో తెలుసుకోవడానికి వారిని సంప్రదించారు. అలాగే 30 శాతం తక్కువ తీవ్రమైన దుష్ప్రభావాలను అనుభవించడంతోపాటు, పాల్గొన్న రోగులు పాస్ సిస్టమ్‌తో స్పష్టంగా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.


నాసా 'వెబ్స్' ద్వారా అతి చిన్న ఉల్కను గుర్తించిన సైంటిస్టులు

Advertisement

Next Story

Most Viewed