- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల కడుపులోకి పురుగులు ప్రవేశించాయని సూచించే లక్షణాలు.. నివారణలు
దిశ, ఫీచర్స్: ‘‘నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ అంటారు, ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవుల ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ది చెందుతాయి’’. తినేటప్పుడు శుభ్రత పాటించకపోవడం వల్ల, మురికి నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తుంది. దీంతో పిల్లలు నుంచి పెద్దల వరకు కడుపులో నులిపురుగులు తయారవుతాయి. కడుపులో పురుగులు చేరాక.. ఆరోగ్యం పాడవుతుంది. కాగా ఈ నులిపురుగులు ప్రవేశించాయని సూచించే లక్షణాలు.. నివారణలు చూద్దాం..
పిల్లల కడుపులో నులిపురుగుల లక్షణాలు..
* విపరీతమైన కడుపునొప్పి
* ఆకలిని కోల్పోవడం
* తరచూ విరేణచనాలు అవ్వడం
* వాంతులు
* మలద్వారంలో దురద
నివారణలు..
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా పిల్లల్లోని నులిపురుగుల సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ గుమ్మడి గింజల్లో కర్కుర్బిటిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీంతో కడుపులో ఉన్న బ్యాక్టిరీయాను కూడా నాశనం చేస్తుంది. మీరు మీ పిల్లలకు గుమ్మడిగింజలతో జ్యూస్ తయారు చేసి తాగించడం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
వెల్లుల్లి, అల్లం..
అల్లంలో యాంటీ పరాన్నజీవి గుణాలు అధికంగా ఉంటాయి. అల్లం కీటకాలను ఈజీగా చంపేస్తాయి. పలు వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇక వెల్లుల్లిలో క్రిమినాశక గుణాలు ఉంటాయి. కడుపులోని నులిపురుగులు ఉన్నట్లైతే వెల్లుల్లి పురుగులను చంపడంలో మేలు చేస్తుంది.
బొప్పాయి..
కడుపులోని కీటకాలను జీర్ణం చేయడంలో బొప్పాయి ఎంతో సహాయపడుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి ఈ పండు తింటే మలంతో పాటు పురుగులు బయటకు వెళ్తాయి. కాగా బొప్పాయి పండును మీ పిల్లలకు తినిపించండి. ఈ సమస్య నుంచి బయటపడేయండి.
గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.