COLON CANCER : పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-29 15:35:50.0  )
COLON CANCER : పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు..
X

దిశ, ఫీచర్స్ : పెద్ద పేగు క్యాన్సర్ తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. కాగా ఇది సూక్ష్మ లక్షణాల కారణంగా ప్రారంభ దశల్లో గుర్తించబడదు. కానీ సమర్థవంతమైన చికిత్స, మెరుగైన ఫలితాల కోసం ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు. వార్నింగ్ సైన్స్ గురించి తెలుసుకోవడం వలన వ్యాధి ముదరక ముందే గుర్తించి ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు నిపుణులు.

1. పేగులో నిరంతర మార్పులు

అతిసారం, మలబద్ధకం లేదా మలం స్థిరత్వంలో మార్పు పెద్దప్రేగు క్యాన్సర్‌కు ప్రారంభ సంకేతం. ఈ మార్పులు కొనసాగితే నెగ్లెక్ట్ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు.

2. మలంలో రక్తం

మలం లేదా టాయిలెట్ పేపర్‌పై రక్తం కనిపించడం.. అది ప్రకాశవంతమైన ఎరుపు లేదా ముదురు రంగులో ఉన్నా దీన్ని తీవ్రమైన లక్షణంగా పరిగణించండి. పెద్ద పేగు క్యాన్సర్‌కు తక్షణ వైద్య సహాయం అవసరం.

3. పొట్టలో అసౌకర్యం

తరచుగా తిమ్మిరి, నొప్పి, ఉబ్బరం పెద్దప్రేగులో సమస్యను సూచిస్తాయి. పొత్తికడుపులో తరచూ అసౌకర్యంగా అనిపించడం సమస్యగానే చూడాలని.. అస్సలు తీసిపారేయరాదని సూచిస్తున్నారు నిపుణులు. దీన్ని అత్యంత తీవ్రమైన లక్షణంగా పరిగణించాలని అంటున్నారు.

4. బరువు తగ్గడం

ఆహారంలో లేదా వ్యాయామంలో ఎలాంటి మార్పులు లేకుండానే ఊహించని విధంగా బరువు తగ్గడం పెద్దప్రేగు క్యాన్సర్ కు సంబంధించిన హెచ్చరిక సంకేతం. ఈ లక్షణం తరచుగా విస్మరించబడుతుంది. కానీ అశ్రద్ధ పనికిరాదని.. ఇలా చేస్తే తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందని చెప్తున్నారు.

5. అలసట లేదా బలహీనత

అలసట లేదా బలహీనతగా అనిపించడం సాధారణమే. కానీ ఎలాంటి పనిచేయకుండానే ఇలా జరగడం.. పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు. బరువు తగ్గడం లేదా కడుపు నొప్పి వంటి ఇతర లక్షణాలతో కలిపి ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించడం ముఖ్యం.

నోట్ .. పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది.

Advertisement

Next Story

Most Viewed