- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోర్లు కొరకడం, చర్మాన్ని నమలడం వంటి అలవాట్లు ఉన్నాయా? ఇలా ఈజీగా బయటపడొచ్చు..
దిశ, ఫీచర్స్ : గోర్లు కొరకడం, జుట్టును లాక్కోవడం, చర్మాన్ని తినేయడం, బుగ్గల లోపలి భాగాన్ని నమలడం లాంటి వింత హ్యాబిట్స్ మన చుట్టుపక్కల ఉండే వారిలో చూసే ఉంటాం. ప్రపంచ జనాభాలో ఐదు శాతం మంది ఇలాంటి అలవాట్లు కలిగి ఉండగా.. దీన్ని ట్రైకోటిల్లోమానియా అని పిలుస్తారు. ఈ పరిస్థితి రక్తస్రావం, గాయాలు, మచ్చలు, బట్టతలకు దారితీస్తుండగా.. ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు ఇదొక కోపింగ్ మెకానిజమ్ కావచ్చు. కాగా జర్మనీకి చెందిన పరిశోధకులు వీటికి హ్యాబిచువల్ రివర్సల్ థెరపీ, డీకప్లింగ్ స్ట్రాటజీ రూపంలో పరిష్కారాలను అందించారు.
ఆరు వారాల అధ్యయనంలో పాల్గొన్న 268 మందిలో 53 శాతం మంది సున్నితమైన స్పర్శ వ్యూహంలో విజయం సాధించినట్లు జామా డెర్మటాలజీలో ప్రచురించబడిన నివేదిక తెలిపింది. రోజుకు రెండుసార్లు, చేతి వెనుక భాగంలో అరచేతిని రుద్దడం లేదా వేలికొనలను తేలికగా, సుతిమెత్తగా నొక్కడం ఈ వ్యూహంలో భాగం. ఈ పద్ధతి ప్రకారం 53 శాతం మంది విజయం సాధించగా.. 80 శాతం మంది హ్యాబిచువల్ రివర్సల్ థెరపీతో సంతృప్తి చెందారని చెప్పారు. వీరిలో నెయిల్-బైటర్స్ గొప్ప విజయాన్ని సాధించారు. జుట్టును లాగడం, చర్మాన్ని తినేసే అలవాటు ఉన్నవారిలో.. చేతులపై కూర్చోవడం, పిడికిలి బిగించడం వంటి పద్ధతులు మంచి రిజల్ట్‌ను ఇస్తాయి.