- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపవాసం చేస్తున్నారా?.. పిల్లలు పుట్టే చాన్స్ తగ్గినట్లే..!!
దిశ, ఫీచర్స్: బరువు తగ్గేందుకు, నాజూగ్గా కనిపించేందుకు కొందరు ఉపవాసం చేస్తుంటారు. ఇంకొందరు పిల్లలు పుట్టాలని ఆలయాల చుట్టూ తిరుగుతూ ఫాస్టింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆహారం తీసుకోవడాన్ని పూర్తిగా తగ్గించేస్తుంటారు. రోజులో ఒకసారో, రెండుసార్లో లేదంటే అసలు తినకుండానే ఉండిపోతున్నారు. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రీప్రొడక్టివ్ హెల్త్‌పై ప్రభావితం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఈస్ట్ ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్న జంటలకు మరిన్ని సమస్యలు కలిగిస్తుందని.. నార్మల్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్‌కు వచ్చిన తర్వాత కూడా ఎగ్స్, స్పెర్మ్ క్వాలిటీపై దీర్ఘకాలిక ప్రభావం కొనసాగుతుందని కనుగొన్నారు.
మానవుల జన్యుస్థాయిని పోలిన జీబ్రాఫిష్‌పై చేసిన ప్రయోగంలో ఈ ఫలితాలను గుర్తించినట్లు చెప్పారు పరిశోధకులు. ‘టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ స్త్రీ, పురుషుల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆహారం తీసుకోవడం పరిమితం చేయడం వల్ల ఆరోగ్యకరమైన ఎగ్స్, స్పెర్మ్‌లను ఉత్పత్తి చేయడానికి శరీరానికి లభించే శక్తిని తగ్గిస్తుంది. దీంతో ఆడవారిలో అండాల నాణ్యత తగ్గగా.. మగవారిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గింది. ఉపవాసం తర్వాత సరైన ఆహారం తీసుకున్నా కూడా ఈ ఎఫెక్ట్ కనబడిందని, అయితే ఎప్పటి వరకు ఈ ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు మరో పరిశోధన అవసరమన్నారు.
Also Read..